ఆధ్యాత్మికం

దేవాలయాలకు వెళ్లే స్త్రీలు వేటిని వెంట తీసుకువెళ్లాలో తెలుసా?

సాధారణంగా మహిళలు తరచూ ఆలయాలను సందర్శించడం మనం చూస్తుంటాము. వారికి ఇష్ట దైవమైన రోజు ఉపవాసం ఉంటూ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆలయానికి వెళ్లేటప్పుడు స్త్రీలు తమ వెంట వేటిని తీసుకువెళ్లాలి ? గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుడికి వెళ్లే స్త్రీలు ఎప్పుడూ కూడా పాశ్చాత్య దుస్తులలో కాకుండా సాంప్రదాయమైన లంగా వోణీ, చీరలను ధరించి మాత్రమే వెళ్లాలి. ఆలయానికి వెళ్ళేటప్పుడు మహిళలు తప్పనిసరిగా సింధూరం పెట్టుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఆలయంలో ఇచ్చే కుంకుమను బొట్టు కింద, విభూదిని బొట్టుపైన పెట్టుకోవాలి.

women should bring these to temples

వినాయకుడి గుడికి వెళ్లే మహిళలు ఆలయానికి వెళ్లేటప్పుడు తమ వెంట గరికను తీసుకొని వెళ్ళాలి. గరిక మాలను సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. శివాలయానికి వెళ్ళే వారు బిల్వ పత్రాలు తీసుకొని శివుడికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. విష్ణు ఆలయాన్ని సందర్శించి వారు తులసి మాలతో వెళ్లాలి. ఆంజనేయుడి ఆలయానికి వెళ్లే వారు వెన్న తీసుకొని వెళ్లాలి. అమ్మవారి ఆలయానికి వెళ్లే వారు పసుపు, ఎరుపు పుష్పాలను వెంట తీసుకొని వెళ్లాలని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts