Muskmelon : వేసవి కాలంలో మనకు సహజంగానే అనేక రకాల పండ్లు సీజనల్‌గా లభిస్తాయి. వాటిల్లో తర్బూజా ఒకటి. ఇవి రుచికి చప్పగా ఉంటాయి. కనుక వీటితో చాలా మంది జ్యూస్ తయారు చేసుకుని తాగుతుంటారు. ఈ క్రమంలోనే తర్బూజా పండ్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేసవిలో మన శరీరంలో నీరు త్వరగా బయటకు పోతుంది. చెమట ఎక్కువగా వస్తుంది కనుక నీరు త్వరగా అయిపోతుంటుంది. అయితే దీన్ని నివారించేందుకు తర్బూజాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని ద్రవాలు ఎక్కువ సేపు ఉంటాయి. తర్బూజాలలో నీరు అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే మన శరీరానికి నీరు లభిస్తుంది. అది శరీరంలో చాలా సేపు ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం తేమగా ఉంటుంది.
2. తర్బూజాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే గుండెను సురక్షితంగా ఉంచుతుంది.
3. తర్బూజాలలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్ల సమస్యలను తగ్గిస్తుంది.
4. అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లతో జ్యూస్ చేసుకుని అందులో చక్కెర కలపకుండా తాగాలి. దీంతో బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరిగిపోతుంది.
5. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు తర్బూజాలను తీసుకుంటే అవి కంట్రోల్ అవుతాయి. అలాగే మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, కడుపులో మంట నుంచి విముక్తి లభిస్తుంది.
6. తర్బూజాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఆ స్టోన్స్ కరిగిపోతాయి. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
7. గర్భిణీలకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే కడుపులోని శిశువుకు ఎంతో పోషణ లభిస్తుంది. దీంతో బిడ్డలో ఎదుగుదల లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే మహిళలు నెలసరి సమయంలో తింటే నొప్పులు తగ్గుతాయి. అధిక రక్తస్రావం కాకుండా ఉంటుంది.
8. తర్బూజాలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.