Sri Reddy : వామ్మో.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప‌చ్చి ప‌చ్చిగా తిట్టేసిన శ్రీ‌రెడ్డి..!

Sri Reddy : శ్రీ‌రెడ్డి అనే పేరు చెబితే చాలు.. ఫైర్ బ్రాండ్ అనే విష‌యం మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. ఈమె ఈ మ‌ధ్య వంట‌లు చేస్తూ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో వాటిని అప్‌లోడ్ చేస్తూ బిజీగా ఉంటోంది.ఇక మ‌ధ్య మ‌ధ్య‌లో వివాదాస్ప‌ద కామెంట్లు కూడా చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఈమెకు అస్స‌లు ప‌డ‌దు. అందుక‌ని అప్పుడ‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి ప‌వ‌న్‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిడుతుంటుంది. ఇక ఇప్పుడు కూడా అలాగే చేసింది.

Sri Reddy yet again sensational comments on Pawan Kalyan
Sri Reddy

ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా త‌న పార్టీ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో మాట్లాడారు. ఇందులో ఆయన సోద‌రుడు నాగ‌బాబు కూడా పాల్గొన‌గా.. ఇద్ద‌రూ వైసీపీ ప్ర‌భుత్వంపై, సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. వ్యంగ్యంగా అనేక కామెంట్లు చేశారు. అయితే శ్రీ‌రెడ్డి వాటికి కౌంట‌ర్ ఇచ్చింది. స్వ‌త‌హాగా జ‌గ‌న్ అంటే అభిమానించే శ్రీ‌రెడ్డి.. ఈ సారి మాత్రం ఆయ‌న‌ను ప‌వ‌న్ అలా అనే సరికి త‌ట్టుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను ఈసారి ఆమె ప‌చ్చి ప‌చ్చిగా తిట్టేసింది.

రంభల పవన్ కళ్యాణ్.. కడుపుల పవన్ కళ్యాణ్.. ఆటలో అరటిపండు లాంటివాడు నాగబాబు అని శ్రీ‌రెడ్డి కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్.. బాబు నేను ఒక్కటే నిన్ను అడుగుతున్నా. నువ్వు 9 సంవత్సరాలని చెప్పి ఆవిర్భావ సభ పెట్టావు కదా. ఈ తొమ్మిదేళ్లలో నువ్వు చేసిన సేవలేంటి ? నువ్వు చేసిన ధర్నాలు ఏవి ? నువ్వు వ్యతిరేకించినవి ఏంటి ? అసలు నీకు రాజకీయాల్లో అర్థమైంది ఏంటి ? అంటూ.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.

నువ్వు చదివిన స్క్రిప్ట్‌లో నేను ఓ నాలుగు ప్రశ్నలు అడిగితే నీ దగ్గర సమాధానం లేదు, ఉండదు. నీకు చెప్పడం చాతకాదు. పవన్ కళ్యాణ్ నీ గుండెల్లో భయం ఉంది. నువ్వు బల్లలు గుద్దుతున్నావు కానీ నీ గుండెదడ ఎలా కొట్టుకుంటోందో నాకు తెలుసు. నీ కళ్ళల్లో భయం చూశా పవన్. జగన్ అన్నను అనడానికి కొనుక్కొచ్చుకున్న ధైర్యం నీది. నీకు ఒరిజినల్‌గా ధైర్యం లేదు. రాజకీయాలు మారుస్తా అని చెబుతున్న నువ్వు ఏం మారుస్తావ్ ? డ్రాయర్లు మార్చడం, పెళ్లాలను మార్చడం తప్ప నీకేమీ రాదు.. అంటూ శ్రీ‌రెడ్డి ఒక రేంజ్‌లో ఫైర్ అయింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆమె కామెంట్స్‌పై ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Editor

Recent Posts