Jonna Rotte : ఒకప్పుడు మన పెద్దలు జొన్నలను బాగా తినేవారు. జొన్నలను రోట్లో వేసి దంచి వాటిని గడకలా వండుకుని తినేవారు. అలాగే జొన్న రొట్టెలను కూడా తినేవారు. కనుకనే ఇప్పటికీ ఎంత వయస్సు వచ్చినా మన పెద్దలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ మనం మాత్రం తెల్లగా మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తింటూ అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. కానీ వాస్తవానికి జొన్నలను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. జొన్నలతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నలను గడక లేదా రొట్టె.. ఏ రూపంలో తీసుకున్నా సరే.. మనకు లాభాలు కలుగుతాయి. జొన్న రొట్టెలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. జొన్నలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది మన ఎముకలను దృఢంగా, బలంగా మారుస్తుంది. అలాగే వీటిల్లో ఉండే ఐరన్ రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
జొన్నలను తినడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. జొన్న రొట్టె డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే జొన్నల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి బయట పడవచ్చు. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రావు. అందువల్ల జొన్నలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.