Papaya Seeds : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండుకూడా ఒకటి. బొప్పాయి పండులో ఉండే విటమిన్స్, మినరల్స్ మరే ఇతర పండ్లల్లో ఉండవని నిపుణులు అంటున్నారు. బొప్పాయి పండును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండులో విటమిన్ ఎ, బి, సి,డి లు తగు మోతాదులో ఉంటాయి. తరచూ బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. దీనిలో ఉండే పెప్సిన్ అనే పదార్థం జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో దోహదపడుతుంది.
తరచూ బొప్పాయిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం మన ఉదరమేనని.. బొప్పాయిని తీసుకోవడం వల్ల ప్రేగులు, జీర్ణాశయం శుభ్రపడి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కేవలం బొప్పాయి పండే కాకుండా బొప్పాయి పండులో ఉండే గింజలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు బొప్పాయి పండులో కంటే బొప్పాయి గింజ్లలోనే ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
ఈ గింజలను తిన్నా కూడా మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చట. బొప్పాయి గింజలు క్యాన్సర్ నివారిణిగా పని చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బొప్పాయి గింజల్లో యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. వైరస్ ల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో కూడా బొప్పాయి గింజలు మనకు సహాయపడతాయి. మంట, వాపు, దురద వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో కూడా బొప్పాయి గింజలు దోహదపడతాయి.
బొప్పాయి గింజల పొడిని ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకుని నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఈ గింజలను ఫ్రూట్ సలాడ్, జ్యూస్ వంటి వాటిలో వేసుకుని తినవచ్చు. అనేక రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ ఈ గింజలను ఒక టీ స్పూన్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ గింజలకు దూరంగా ఉండాలి. ఈ విధంగా బొప్పాయి పండుతోపాటు బొప్పాయి గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని.. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని.. వైద్య నిపుణులు సూచిస్తున్నారు.