Bread Omelette : బ్రెడ్ ఆమ్లెట్ ఎంతో రుచిగా రావాలంటే.. ఇలా త‌యారు చేయండి..

Bread Omelette : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఆహారంగా బ్రెడ్ ను తీసుకుంటూ ఉంటాం. టీ, పాలు వంటి వాటితో దీనిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ బ్రెడ్ తో వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసుకోద‌గిన వాటిల్లో బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒక‌టి. బ్రెడ్ ఆమ్లెట్ ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. చాలా సుల‌భంగా, రుచిగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైసెస్ – 3, కోడిగుడ్లు – 4, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ట‌మాటా ముక్క‌లు – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, నూనె – త‌గినంత‌.

Bread Omelette make in this way everybody like it
Bread Omelette

బ్రెడ్ ఆమ్లెట్ త‌యారీ విధానం..

ముందుగా బ్ర‌డ్ ను వెన్న లేదా నూనె వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. ఇలా అన్ని బ్ర‌డ్ స్లైసెస్ ల‌ను కాల్చుకున్న త‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను వేసి నురుగు వ‌చ్చే వ‌ర‌కు బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ కోడిగుడ్ల మిశ్ర‌మంలో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి వేడి చేయాలి. త‌రువాత అందులో కొద్దిగా నూనెను వేయాలి. ఇప్పుడు మ‌నం ముందుగా క‌లిపి పెట్టుకున్న గుడ్డు మిశ్ర‌మాన్ని క‌ళాయి అంతా వ‌చ్చేలా వేసుకోవాలి. త‌రువాత ఇందులో కాల్చిన బ్రెడ్ ను 3 సెక‌న్ల‌ పాటు ఉంచి బ్రెడ్ ను మాత్ర‌మే మ‌రోవైపుకు తిప్పి అలాగే ఉంచాలి.

త‌రువాత ఈ బ్రెడ్ మీద కూడా కొద్దిగా గుడ్డు మిశ్ర‌మాన్ని రాసి క‌ళాయిపై మూత‌ను ఉంచి మ‌ధ్య‌స్థ మంట‌పై 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. త‌రువాత మూత తీసి మ‌రోవైపుకు తిప్పాలి. క‌ళాయిపై మ‌ర‌లా మూత‌ను ఉంచి మ‌రో నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ త‌యార‌వుతుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల రుచిగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ ను నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఉద‌యం అల్పాహారంలో భాగంగా లేదా స్నాక్స్ గా కూడా తీసుకోవ‌చ్చు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ను పిల్ల‌ల‌తోపాటు పెద్ద‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts