Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను నాన‌బెట్టి భోజ‌నానికి ముందు తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Sabja Seeds : అధిక బ‌రువు.. మ‌నల్ని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య తలెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన జీవన విధానం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, త‌గినంత వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వాటిని బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ర‌క్త‌పోటు, షుగ‌ర్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు అధిక బ‌రువు కార‌ణం అవుతుంది. క‌నుక మ‌నం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌ని వైద్యులు సూచిస్తూ ఉంటారు. రోజుకు రెండు సార్లు వ్యాయామం చేయ‌డం, ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం, డైటింగ్ చేయ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

కానీ ఇవి పాటించ‌డం అంద‌రి వ‌ల్ల కాదు. క‌నుక మ‌నం బ‌రువు త‌గ్గ‌డానికి సులువైన మార్గాలను ఎంచుకోవాలి. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు రెండు పూట‌లా భోజ‌నానికి ముందు స‌బ్జా గింజ‌ల‌ను తీసుకున్న‌ట్ట‌యితే సుల‌భంగా బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గ‌డానికి ఇదే సుల‌భ‌మైన మార్గ‌మని నిపుణులు చెబుతున్నారు. స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌యం అవుతాయి. ఇవి శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. చూసేందుకు చిన్న‌గా, న‌లుపు రంగులో ఉండే ఈ గింజ‌లు నీటిలో వేయ‌గానే లావుగా, తెల్ల‌గా అవుతాయి. ఈ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి అదుపులో ఉంటుంది. ఈ గింజ‌ల‌ను నాన‌బెట్టి ఆహార ప‌దార్థాల్లో, జ్యూస్ ల‌ల్లో వేసుకుని తీసుకోవ‌చ్చు. అదేవిధంగా ఈ స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి గింజ‌ల‌తో స‌హా నీటిని తీసుకోవ‌చ్చు.

take soaked Sabja Seeds before meals for these benefits
Sabja Seeds

ఇలా స‌బ్జా నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. వీటిలో క్యాల‌రీలు అధికంగా ఉండ‌వు. రోజూ ఈ స‌బ్జా నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. ముఖం అందంగా క‌న‌బ‌డుతుంది. ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. వినికిడి సంబంధిత స‌మ‌స్య‌ల‌ను నివారించే గుణం కూడా స‌బ్జా గింజ‌ల‌కు ఉంది. స‌బ్జా గింజ‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటితో త‌యారు చేసిన స‌బ్జా గింజ‌ల నీటిని తీసుకోవ‌డం వల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు కూడా అదుపులో ఉంటాయి.

స‌బ్జా గింజ‌ల నీటిలో నిమ్మర‌సం, పంచ‌దార క‌లిపి తీసుకుంటే అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతుంది. స‌బ్జా నీరు మ‌న‌కు యాంటీ బ‌యాటిక్ గా కూడా పని చేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది. టైప్ 2 మ‌ధుమేహంతో బాధ‌ప‌డే వారు స‌బ్జా గింజ‌ల నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శ‌రీర జీవ‌క్రియ‌ల రేటును పెంచ‌డంలో కూడా స‌బ్జా గింజ‌ల నీరు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. వాంతులు, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా స‌బ్జా గింజ‌లు నివారిస్తాయి.

వేడి నీటిలో నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌ల‌కు అల్లం ర‌సం, తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా స‌బ్జా గింజ‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ్ల‌ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. సుల‌భంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వారు అంటున్నారు.

D

Recent Posts