Bottle Gourd : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ సొర‌కాయ జ్యూస్‌తో.. శ‌రీరంలో కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది..!

Bottle Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. ఇది మ‌న‌కు అత్యంత చ‌వ‌క‌గా ల‌భిస్తుంది. చాలా మంది సొర‌కాయ‌ల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ సొర‌కాయ మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీన్ని రోజూ నేరుగా తిన‌లేని వారు జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున సొర‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగితే అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

drink Bottle Gourd juice on empty stomach for these benefits
Bottle Gourd

1. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ అనేక సంద‌ర్భాల్లో ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో తీవ్ర‌మైన మాన‌సిక స‌మ‌స్యలు వ‌స్తున్నాయి. నిద్ర ప‌ట్ట‌డం లేదు. కానీ రోజూ ప‌ర‌గ‌డుపునే సొర‌కాయ జ్యూస్‌ను తాగితే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి త‌గ్గి హాయిగా ఉంటుంది. చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. క‌నుక రోజూ సొర‌కాయ జ్యూస్‌ను తాగాలి.

2. గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో సొర‌కాయ అద్భుతంగా ప‌నిచేస్తుంది. సొర‌కాయ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. అలాగే హైబీపీ త‌గ్గి బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

3. సొర‌కాయ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఇందులో ఉండే ఐర‌న్‌, విట‌మిన్లు, పొటాషియం మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌ని చూసే వారికి సొర‌కాయ జ్యూస్ అత్యుత్త‌మంగా ప‌నిచేస్తుంది. వేగంగా బ‌రువును త‌గ్గించుకోవచ్చు.

4. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ సొర‌కాయ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ‌మైన నిద్ర‌లోకి జారుకుంటారు. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. జుట్టు స‌మ‌స్య‌లు ఉన్న‌వారు సొర‌కాయ జ్యూస్‌ను తాగాలి. దీంతో తెల్ల‌గా ఉన్న వెంట్రుక‌లు న‌ల్ల‌గా మారుతాయి. జుట్టు రాల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

6. సొర‌కాయ‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. క‌నుక రోజూ ప‌ర‌గ‌డుపునే సొర‌కాయ జ్యూస్‌ను తాగితే ఎన్నో విధాలుగా ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts