Adah Sharma : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ పనులకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఇస్తుండడం మామూలే. ఇక హీరోయిన్స్ అయితే గ్లామరస్ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు. అది కూడా ఓకే. కానీ కొందరు సెలబ్రిటీలు చేసే పనులే వారిని నవ్వుల పాలు చేస్తుంటాయి. హీరోయిన్ ఆదా శర్మ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే మారింది. ఆమె చేసిన ఓ పనికి ఆమె అవమానాల పాలవుతోంది. నెటిజన్లు అయితే ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి ఇటీవలే కన్నుమూసిన విషయం విదితమే. అయితే ఆయన బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయను అనుకరిస్తూ ఆదా శర్మ ఒళ్లంతా బంగారు ఆభరణాలను ధరించింది. ఎద అందాలను చూపిస్తూ బప్పిలహరిలా వేషధారణలోకి మారిపోయింది. అంతటితో ఆగకుండా ఆయనను తనతో పోల్చుకుంటూ సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసింది. దానికి ఓ కామెంట్ కూడా పెట్టింది. ఉత్తమమైన కామెంట్ ఎవరు పెడతారో చూద్దాం.. అని కోరింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది.
బప్పిలహరిని అవమానిస్తూ ఆదా శర్మ పోస్టు పెట్టిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌ను అవమానించిందని ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆదా శర్మకు ఇదేం పోయేకాలం.. మతిగానీ భ్రమించిందా.. అని అంటున్నారు. అలాంటి ప్రముఖ సంగీత దర్శకుడిని అలా అవమానించడం సరికాదని.. ఇంకోసారి ఇలా చేయకు.. అని ఆదా శర్మను హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పోస్టు వైరల్‌గా మారింది.