కూర‌గాయ‌లు

Beetroot Juice : ఒక కప్పు బీట్‌ రూట్‌ జ్యూస్‌ను రోజూ తాగితే ఇన్ని లాభాలా..!

Beetroot Juice : బీట్‌రూట్‌ తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది అందించే ప్రయోజనాలు అమోఘం. అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. కనుక రోజూ బీట్‌రూట్‌ను తీసుకోవాల్సిందే. అయితే బీట్‌రూట్‌ను తినలేని వారు దాన్ని జ్యూస్‌ తీసి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందు ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. దీంతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. మహిళలకు, గర్భిణీలకు, రక్తం తక్కువగా ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగితే శక్తి లభిస్తుంది. ఉదయం తాగుతారు కనుక రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎక్కువ పనిచేసినా అలసిపోరు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

take daily one cup beetroot juice

పొడి చర్మం ఉన్నవారు రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. వాపులు ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

లివర్‌ సమస్యలు ఉన్నవారు రోజూ ఈ జ్యూస్‌ను తాగితే లివర్‌ శుభ్రంగా మారుతుంది. లివర్‌ పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.

హైబీపీ ఉన్నవారికి బీట్‌రూట్‌ వరమనే చెప్పవచ్చు. ఈ జ్యూస్‌ను తాగితే బీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. డయాబెటిస్‌ ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగితే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది.

Admin

Recent Posts