Off Beat

ఒక ఊర్లో ఒక ధ‌నికున్ని ఆధ్యాత్మిక ప్ర‌వ‌చనాల‌కు ఆహ్వానించారు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ఒక ఊర్లో వున్న గుడిలో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు, ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తాడు.. అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట . వచ్చి సాధించేది ఏమి వుంది? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా? అందుకే గుడికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు.

అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట …

నాకు పెళ్ళి అయ్యి పదిహేనేళ్లు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం కొన్ని వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా? కానీ నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని పొందగలిగాను.

a sage invited a rich man for pravachanam what happened next

ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే నాకు ఆ శక్తి ఎక్కడిది? ఈ పాటికి చనిపోయి వుండేవాడిని’.

అందుకే, శరీరానికి భోజనం ఆహారం ఎలాగో, మనసుకు దైవ ధ్యానం, దైవ నామ స్మరణ అలాగా!

అందుకే దైవస్మరణ నిరంతరం చేస్తూనే వుండాలి.

మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.

Admin

Recent Posts