Off Beat

ఇండియాకు బ్రిటిష్ వారు వదిలిపెట్టిన 7 పద్ధతులు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు భారత దేశ ప్రజల్ని అనేక చిత్రహింసలకు గురి చేశారనే ఈ విషయం అందరికీ తెలిసిందే. వారి ఆకృత్యాలను గుర్తు చేసుకుంటే మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది. అలాంటి ఆంగ్లేయులు మన దేశాన్ని ఏ విధంగా దోచుకున్నారో, అదేవిధంగా మన దేశానికి కొన్ని మంచి పనులను కూడా నేర్పించారు.. అవును మీరు విన్నది నిజమే.. వారు నేర్పిన మంచి పనులు ఏంటో ఒకసారి చూద్దాం..?

1. ఇంగ్లీష్ భాష

బ్రిటిష్ వారు భారత దేశాన్ని పరిపాలించే సమయంలో పరిపాలన సౌలభ్యం కోసం ఇంగ్లీషు నేర్పింది. అందుకే మన దగ్గర చాలామంది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ భాషా ద్వారానే మన భారతదేశం అనేక అవకాశాలను, ఇతర దేశాలతో స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటుంది.

2. భారత రైల్వే

భారతదేశంలో రైలు అనే నెట్వర్క్ ను స్థాపించింది బ్రిటిష్ వారే. అందుకే మన రైల్వే స్టేషన్ చాలా వరకు బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినట్లు కనబడతాయి. అయితే వీరు దీని ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సరుకులను రవాణా చేయడానికి ఉపయోగించేవారు. భారత్ లో మొట్టమొదటి రైలును ముంబై నుంచి థానే వరకు దాదాపుగా 34 కిలోమీటర్లు నడిపింది.

3. భారత సైన్యం

ప్రపంచ దేశాల్లోని అత్యంత శక్తివంతమైన సైన్యాలలో నాలుగో స్థానంలో ఉంది భారత దేశ సైన్యం. ఈ ఆర్మీ అనేది బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పడింది. ఇప్పటికీ మన ఆర్మీలో సంస్కృతి పద్ధతులు ఈస్టిండియా కంపెనీనీ తలపిస్తాయి.గుర్కా మరియు సిక్కు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ చెందినటువంటి ఒక సిక్కు సైనికుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కి చెందిన ఒక గుర్కా సైనికుడి ఖుక్రీనీ తనిఖీ చేస్తాడు.

british people left these impact on us

4. టీకాలు

బ్రిటిష్ వారి పాలనకు ముందు భారతదేశంలో వ్యాక్సిన్లు అంటే ఎవరు నమ్మే వారు కాదు. అయితే 19వ మరియు 20వ శతాబ్దంలో ఇండియాలో స్మాల్పాక్స్ తీవ్రంగా వ్యాప్తి చెందినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాటిని నిరోధించడానికి 1892 లో టీకా చట్టాన్ని ఆమోదించింది.

5. సామాజిక సంస్కరణలు

భారతదేశంలో పూర్వ కాలంలో అనేక ప్రాచీన పద్ధతులు ఉండేవి. వీటన్నింటికీ బ్రిటిష్ వారు చరమగీతం పాడారు. వీటిలో ముఖ్యంగా బాల్య వివాహాలు అంటరానితనం వంటి వాటిని రద్దు చేశారు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన మహిళలకు మళ్లీ వివాహం చేయడానికి ప్రోత్సహించారు. ఈ సంస్కరణల విషయంలో సంఘసంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్ బ్రిటిష్ కు మద్దతుగా నిలిచారు.

6. జనాభా గణన

భారతదేశంలో 1871 ముందు జనాభాను ఎప్పుడూ కూడా లెక్కించలేదు. కానీ బ్రిటిష్ వారు వచ్చాక పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కించాలని జనాభా గణనను ప్రారంభించారు.

7. సర్వేలు

జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా1851లో బ్రిటిష్ వారు ప్రారంభించారు. నగరాలు మరియు గ్రామాలను సర్వే చేయడానికి భారతదేశం మ్యాప్ ను రూపొందించడానికి ఈ సంస్థ వచ్చింది. ఇప్పటికీ వారు చేసిన మ్యాప్ నే మనం చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం. దీన్ని సర్వే చేయడానికి బ్రిటిష్ వారు అనేక అధునాతన పరికరాలు ప్రవేశపెట్టారు. ఇప్పటికీ వారు చేసిన మ్యాప్ నే మనం చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం. దీన్ని సర్వే చేయడానికి బ్రిటిష్ వారు అనేక అధునాతన పరికరాలు ప్రవేశపెట్టారు.

Admin

Recent Posts