Peanuts : షుగ‌ర్ ఉన్న‌వారు ప‌ల్లీల‌ను తిన‌వ‌చ్చా.. తింటే ఏం జ‌రుగుతుంది..?

Peanuts : షుగ‌ర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో రోజురోజుకూ ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పెద్ద వారితో పాటు న‌డి వ‌య‌స్కులు, యువ‌త కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఏది ఏమైన‌ప్ప‌టికి ఈ వ్యాధి బారిన ప‌డిన వారు జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. అయితే ఈ షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది.

షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా నీర‌సం, అల‌స‌ట‌, రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక‌పోవ‌డం, బ‌రువు త‌గ్గ‌డం వంటి స‌మ‌స్య‌ల బారిన ఎక్కువ‌గా ప‌డుతూ ఉంటారు. ఇటువంటి స‌మ‌స్య‌ల బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అలాగే బ‌రువు పెర‌గడానికి ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. క‌నుక మ‌నం తీసుకునే ఆహారం షుగ‌ర్ స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డంతో నీర‌సాన్ని త‌గ్గించి బ‌రువును పెంచేదై ఉండాలి. అలాంటి ఆహారాల్లో వేరుశ‌న‌గ ఒక‌టి. వేరుశ‌న‌గ‌ప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోషకాలతో పాటు ఇవి మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. క‌నుక వీటిని పేదవారి జీడిప‌ప్పు అని అంటారు. వేరుశ‌న‌గ‌పప్పులో కొలెస్ట్రాల్ ఉండ‌దు.

can diabetics eat Peanuts what happens
Peanuts

ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి. వీటిలో 45 శాతం కొవ్వు, 25 శాతం మాసంకృత్తులు ఉంటాయి. పిండిప‌దార్థాలు చాలా త‌క్కువ శాతంలో ఉంటాయి. పిండి ప‌దార్థాలు ఉన్న ఆహారాలు షుగ‌ర్ స్థాయిల‌ను పెంచుతాయి. కొవ్వు, మాంస‌కృత్తులు ఎక్కువ‌గా ఉన్న ఆహారాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. వేరుశ‌న‌గ‌ప‌ప్పుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు శ‌రీరానికి అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది. నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బ‌రువు కూడా పెర‌గ‌వ‌చ్చు. ఈ వేరుశ‌న‌గ‌ప‌ప్పుల‌ను నేరుగా తిన‌డానికి బ‌దులుగా వీటిని నీటిలో నాన‌బెట్టుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. రోజూ గుప్పెడు వేరుశ‌న‌గ‌ప‌ప్పుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి తీసుకోవాలి.

ఇలా నాన‌బెట్టిన వేరుశ‌న‌గ‌ప‌ప్పుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వికారం క‌ల‌గ‌కుండా ఉండడంతో పాటు జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తకుండా ఉంటాయి. అలాగే చాలా మంది ఈ వేరుశ‌న‌గ‌పప్పుల‌ను బెల్లంతో క‌లిపి తింటారు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు బెల్లానికి బ‌దులుగా ఒక‌టి లేదా ఎండు ఖ‌ర్జూరాలతో క‌లిపి తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఈ విధంగా వేరుశ‌న‌గ ప‌ప్పుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి పెర‌గ‌కుండా ఉండ‌డంతో పాటు ఇత‌ర‌త్రా ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి.

Share
D

Recent Posts