క్యాన్సర్. ఇదో మహమ్మారి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రజలు దీని బారిన పడి మృతి చెందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వల్ల దాదాపుగా 7.60 కోట్ల మంది ఏటా మృత్యువాత పడుతున్నారు. అందులో 30 నుంచి 69 సంవత్సరాల వయస్సున్న వారే అధికంగా ఉన్నారు. ఇది మేం చెబుతోంది కాదు. క్యాన్సర్ పట్ల పోరాటం చేస్తున్న పలు సంస్థలు వెల్లడిస్తున్న నిజాలు. ఆరంభంలో ఉండగానే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స చేయగలమని, అదే వ్యాధి ముదిరితే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దానికి మందు కూడా లేదు. ఇది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాకు చెందిన పలువురు సైంటిస్టులు క్యాన్సర్ మహమ్మారిని కేవలం కొద్ది రోజుల్లోనే నయం చేసే ఓ అద్భుతమైన ఔషధాన్ని ఇటీవలే కనుగొన్నారు. అదీ ఓ మొక్కకు చెందిన పండు సహాయంతో..!
ఆ మొక్క పేరు Fontainea Picrosperma (ఫాంటేనియా పిక్రోస్పెర్మా). ఉత్తర ఆస్ట్రేలియాలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. బెర్రీల జాతికి చెందినది ఈ మొక్క. అయితే ఈ మొక్కకు చెందిన పండు నుంచి తీసిన పదార్థాలతో క్యూఐఎంఆర్ బెర్గోఫర్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారు పరిశోధనలు చేశారు. ఆ పండులోని విత్తనాలను ప్రత్యేకంగా వేరు చేసి వాటిని ఔషధంగా మార్చి, దాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ కుక్కకు ఎక్కించారు. అయితే ఆ ఔషధం ఎక్కించగానే ఆ కుక్కలో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందట. అంతేకాదు, కేవలం 15 రోజుల్లోనే ఆ కుక్క క్యాన్సర్ నుంచి పూర్తిగా బయట పడిందట. ఆ కుక్క శరీరంపై ఉన్న ఓ ట్యూమర్ పూర్తిగా కనుమరుగైపోయిందట.
దీంతో ఫాంటేనియా మొక్కకు చెందిన పండ్లకు క్యాన్సర్ వ్యాధిని నయం చేయగలిగే శక్తి ఉందని సదరు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాదు మెలనోమా అనే ఓ రకమైన క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఓ మహిళ వ్యాధిని కూడా 75 శాతం వరకు నయం చేయగలిగారట. అందుకు కూడా ఈ మొక్క పండ్లను ఉపయోగించారట. వాటితో వారు ఈబీసీ-46 అనే ఓ ఔషధాన్ని తయారు చేసి ఆ మహిళపై ప్రయోగించారు. దీంతో ఆమెకు ఉన్న క్యాన్సర్ దాదాపుగా నయం అయిందని ఆ పరిశోధనకు నాయకత్వం వహించిన సైంటిస్టులు చెబుతున్నారు. అయితే సదరు పండుపై ఇంకా ప్రయోగాలు చేయాల్సి ఉందట. అతి త్వరలోనే క్యాన్సర్ వ్యాధి ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ ఔషధం వస్తే మాత్రం ఇక క్యాన్సర్‌తో మరణించే వారు తక్కువైపోతారు కదా..! దాంతో ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి.