Fingers : మీ చేతి వేళ్లు ఇలా ఉన్నాయా ? అయితే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట..!

Fingers : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ల కార‌ణంగా ఇటీవ‌లి కాలంలో చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. హైబీపీ, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉండ‌డం, అధిక బ‌రువు, పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, ఒత్తిడి.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు కొద్ది రోజుల ముందే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం ద్వారా ముందుగానే చికిత్స తీసుకోవ‌చ్చు. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

if you have Fingers like this then you may get heart diseases
Fingers

ఛాతిలో ప‌ట్టేసిన‌ట్లు ఉండ‌డం, శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం, ఛాతిలో సూదుల‌తో గుచ్చినట్లు ఉండ‌డం, ఛాతి మీద బ‌రువు పెట్టిన‌ట్లు అనిపించ‌డం.. ఎడ‌మ వైపు ద‌వ‌డ‌, మెడ‌, భుజం, చేయి నొప్పిగా ఉండ‌డం.. చిన్న ప‌ని చేసినా విప‌రీత‌మైన అల‌స‌ట‌, ఆయాసం రావ‌డం, అస‌లు ఏమాత్రం ప‌నిచేయ‌లేక‌పోవ‌డం, చెమ‌ట‌లు ఎక్కువ‌గా ప‌ట్ట‌డం.. వంటివ‌న్నీ గుండె పోటు వ‌చ్చేముందు క‌నిపించే సంకేతాలే. క‌నుక వీటిని జాగ్ర‌త్తగా ప‌రిశీలిస్తే గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

ఇక చేతి వేళ్ల సైజ్‌ను బ‌ట్టి కూడా గుండె జ‌బ్బులు వ‌స్తాయో, రావో చెప్పేయ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే 200 మంది పురుషుల‌ను కొందరు సైంటిస్టులు ప‌రిశీలించారు. చివ‌ర‌కు తేలిందేమిటంటే.. ఉంగ‌రం వేలు క‌న్నా చూపుడు వేలు పొడవు ఎక్కువ‌గా ఉంటే అలాంటి వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు 80 శాతం వ‌ర‌కు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. సాధారణంగా అంద‌రికీ చేతి వేళ్ల‌లో మ‌ధ్య వేలు పొడ‌వుగా ఉంటుంది. దాని త‌రువాత ఉంగ‌రం వేలు, ఆ త‌రువాత చూపుడు వేలు పొడ‌వుగా ఉంటాయి. కానీ కొంద‌రిలో మ‌ధ్య వేలు, ఉంగ‌రం వేలు, చూపుడు వేలు.. ఈ మూడు వేళ్లూ స‌మానంగా ఉంటాయి. అలాగే ఇంకొంద‌రికి ఉంగ‌రం వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటుంది. ఇలా రెండు ర‌కాలుగా వేళ్ల పొడ‌వు ఉన్న వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. వీరిలో 35 నుంచి 85 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారికి రిస్క్ ఇంకా ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. క‌నుక వీరు జాగ్ర‌త్త‌గా ఉండాలని సూచిస్తున్నారు.

Share
Admin

Recent Posts