ఫోన్లలాగే కంప్యూటర్లు కూడా అప్పుడప్పుడు హ్యాంగ్ ( Computer Hang ) అవుతుంటాయి. మనం ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కంప్యూటర్ హ్యాంగ్ అయితే యమా చిరాకు వస్తుంది. కానీ ఏం చేయలేం కదా. అయితే ఆ సమస్య తరచూ వస్తుందంటే మాత్రం అందుకు కొన్ని కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఈ సమస్య ల్యాప్‌టాప్‌లను వాడేవారికి వస్తుంది. చాలా మంది ల్యాప్‌టాప్‌తో అవసరం అయిపోయాక దాన్నిషట్ డౌన్ చేయకుండా స్లీప్ మోడ్‌లో పెడతారు. అయితే ఇలా చేయరాదు. ల్యాప్‌టాప్ హ్యాంగ్ అవుతుంది. కనుక ఎల్లప్పుడూ ల్యాప్‌టాప్‌ను షట్ డౌన్ చేయాలి. అవసరం అయితే మళ్లీ ఆన్ చేసి వాడుకోవాలి.
* కంప్యూటర్‌లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్‌కు గాను ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను ఇస్తుంటారు. వాటిని అప్‌డేట్ చేయకపోయినా కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది. కనుక సాఫ్ట్‌వేర్‌ను ఎప్పుడూ అప్‌డేట్ చేయాలి.
* ఉపయోగం లేని సాఫ్ట్‌వేర్‌లను తీసేస్తే కంప్యూటర్ హ్యాంగ్ అయ్యే సమస్య తగ్గుతుంది.
* ప్రస్తుతం ఉన్న విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌కు 4జీబీ ర్యామ్ సరిపోవడం లేదు. కనుక ర్యామ్‌ను కచ్చితంగా 8జీబీకి మార్చుకోవాలి. దీంతో కంప్యూటర్ హ్యాంగ్ అవదు.
* కంప్యూటర్‌లో ఉండే ఎస్ఎస్‌డీ లేదా హార్డ్ డిస్క్ లో ఫైల్స్ బాగా నిండిపోయినా కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది. కనుక స్టోరేజ్‌ను క్లియర్ చేయాలి. లేదా కొత్తగా స్టోరేజ్‌ను యాడ్ చేయాలి. దీంతో పీసీ హ్యాంగ్ అవదు.
* కంప్యూటర్‌లో ఎప్పటికప్పుడు పేరుకుపోయే టెంపరరీ ఫైల్స్‌ను క్లీన్ చేయాలి. అందుకు సిక్లీనర్ వంటి సాఫ్ట్ వేర్స్ పనికొస్తాయి. దీంతో కంప్యూటర్ హ్యాంగ్ కాకుండా ఉంటుంది.