Medi Chettu : మేడి చెట్టుతో పురుషులు ఈ విధంగా చేస్తే.. అప్పులు పోయి డ‌బ్బు బాగా సంపాదిస్తారు..

Medi Chettu : మ‌న చుట్టూ ఉండే కొన్ని ర‌కాల చెట్లు ఔష‌ధాల‌తోపాటు అద్భుత‌ శ‌క్తుల‌ను కూడా క‌లిగి ఉంటాయి. అలాంటి చెట్ల‌ల్లో మేడి చెట్టు కూడా ఒక‌టి. మేడి చెట్టు ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని, ఈ చెట్టులో ప్ర‌తిభాగం కూడా మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌న‌కు తెలుసు. మ‌న‌కు వ‌చ్చే ఆర్థిక‌, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మేడి చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది. మేడి చెట్టులో బ్ర‌హ్మ మేడి, అత్తిమేడి అనే రెండు ర‌కాలు ఉంటాయి. మానసిక స‌మ‌స్య‌ల‌ను కూడా మేడి చెట్టు దూరం చేస్తుంది. మేడి చెట్టు కింద దీపారాధ‌న చేసి ధ్యానం చేసిన‌ట్ట‌యితే అద్భుత‌మైన జ్ఞాన‌సంప‌ద, ప్ర‌శాంత‌త‌ క‌లుగుతాయ‌ని, సాక్షాత్తూ ద‌త్తాత్రేయ స్వామే మేడి చెట్టుపై కొలువై ఉంటాడ‌ని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా గురుబ‌లం కూడా పెరుగుతుంద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ చెట్టును మ‌న ఇంట్లో పెంచుకుంటూ దీప ధూప నైవేద్యాల‌ను స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల మ‌న ఇంట్లో ఉండే స‌మ‌స్య‌ల‌కు ఆ ద‌త్తాత్రేయుడే పరిష్కారం చూపిస్తాడ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. మ‌న ఇంట్లో స‌మ‌స్య‌లకు మేడి చెట్టు ఏవిధంగా ప‌రిష్కారం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో స‌మ‌స్య‌లు ఉన్న వారు ర‌వి పుష్య‌మి న‌క్ష‌త్రానికి ముందు రోజు ఆ ఇంట్లోని పురుషులు త‌ల‌స్నానం చేసి మేడిచెట్టు వ‌ద్ద‌కు వెళ్లాలి. ఆ చెట్టు మొద‌ట్లో నీళ్లు పోసి ధూప దీప నైవేద్యాల‌ను స‌మ‌ర్పించి ఆ చెట్టు మొద‌ట్లో ప‌సుపు, కుంకుమ‌ను వేసి పూజ చేయాలి.

Medi Chettu is very beneficial in removing health and money problems
Medi Chettu

ఇలా చేసిన త‌రువాత ఆ చెట్టుకు ఉత్త‌రం వైపు ఉన్న వేరును తీసుకోవాలి. ఈ వేరును సేక‌రించేట‌ప్పుడు స్వామి నా అవ‌స‌రాల రీత్యా ఈ వేరును తీసుకుంటున్నాను. నా క‌ష్టాల నుండి న‌న్ను బ‌య‌ట‌ప‌డేయి స్వామి అని మ‌న‌సులో అనుకోవాలి. ఇలా ఆ వేరును ఇంటికి తెచ్చుకున్న మ‌రుస‌టి రోజు మళ్లీ ఆ చెట్టు వ‌ద్ద‌కు వెళ్లి ప్ర‌ద‌క్షిణం చేసి మ‌ళ్లీ ధూప దీప నైవేద్యాలను స‌మ‌ర్పించి అష్టోత్త‌రం చ‌ద‌వాలి. ఇలా చేసిన త‌రువాత ఆ వేరును మెడ‌లో తాయ‌త్తులా క‌ట్టుకోవాలి. ఈ వేరును ఒక అంగుళం పొడ‌వు ఉండేలా చూసుకోవాలి. అలాగే వేరును మంచి ప్ర‌దేశంలో ఉన్న చెట్టు నుండి మాత్ర‌మే సేక‌రించాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌న స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా మేడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల పోష‌కాలు అందుతాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అజీర్తి, క‌డుపులో పుండ్లు వంటి స‌మ‌స్యలు కూడా త‌గ్గుతాయి. మేడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ సాఫీగా సాగ‌డంతోపాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. ఎక్కువ ఆక‌లితో బాధ‌ప‌డేవారు ఈ మేడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆక‌లి త‌క్కువ‌గా అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మేడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. నిద్రలేమి స‌మ‌స్య ఉన్న వారు ఈ పండ్ల‌ను రాత్రిపూట తిన‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది. ఈ విధంగా మేడి చెట్టు మ‌న‌కు వ‌చ్చే ఆర్థిక‌, అనారోగ్య‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌న్నింటినీ త‌గ్గిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts