business ideas

Business Ideas :అల్యూమినియం ఫాయిల్ బాక్సులతో.. బోలెడంత ఆదాయం..!

హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క‌ర్రీ పాయింట్లు.. ఇలా ఎక్క‌డ చూసినా ప్ర‌స్తుతం ఆహార ప‌దార్థాల‌ను చాలా మంది అల్యూమినియం ఫాయిల్స్‌తో త‌యారు చేయ‌బ‌డిన బాక్సుల్లో పెట్టి ఇస్తున్నారు. ఇక రైళ్ల‌లోనూ వీటి వినియోగం ఎక్కువ‌గానే ఉంది. అనేక చోట్ల ఆహారాల‌ను ఈ బాక్సుల్లోనే పెట్టి విక్ర‌యిస్తున్నారు. అయితే వీటిని త‌యారు చేసి అమ్మితే ఎక్కువ ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్‌కు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో, ఏమేర లాభాలు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

అల్యూమినియం ఫాయిల్ బాక్సుల‌ను భిన్న సైజుల్లో, భిన్న ఆకృతుల్లో త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ బిజినెస్‌కు గాను సుమారుగా రూ.8 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది. అలాగే ఆ బాక్సుల‌ను త‌యారు చేసే యంత్రాల‌ను ఉంచ‌డానికి, ప‌ని కోసం.. క‌నీసం 800 నుంచి 1000 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం అవస‌రం అవుతుంది. ప‌నికోసం 3 నుంచి 5 మంది వ‌ర్క‌ర్లు అవ‌స‌రం అవుతారు. అలాగే ఈ ప‌రిశ్ర‌మకు అల్యూమినియం ఫాయిల్ ముడిప‌దార్థం అవ‌స‌రం అవుతుంది. దీన్ని 3003 హెచ్‌24 క్వాలిటీ ఉన్న‌ది కొనుగోలు చేయాలి.

you can earn good income with aluminium foil boxes

అల్యూమినియం ఫాయిల్ బాక్సుల త‌యారీకి ఫుల్లీ ఆటోమేటిక్‌, సెమీ ఆటోమేటిక్ మెషిన్లు అవ‌స‌రం అవుతాయి. మ‌నం పెట్టే పెట్టుబ‌డిని బట్టి మెషిన్ల‌ను ఎంపిక చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ కంటెయిన‌ర్ మేకింగ్ మెషిన్ క‌నీస ధ‌ర రూ.6 ల‌క్ష‌లు ఉంటుంది. ఇక ఈ మెషిన్ ద్వారా ముందుగా ఫాయిల్స్‌ను త‌యారు చేసి క‌ట్ చేయాలి. వాటిని మెషిన్ స‌హాయంతో బాక్సులుగా త‌యారు చేయాలి. ఈ క్ర‌మంలో అలా త‌యారైన బాక్సుల‌ను ప్యాక్ చేసి అమ్మ‌వ‌చ్చు.

ఈ బిజినెస్‌లో లాభం ఎక్కువ‌గానే ఉంటుంది. నిత్యం 200 ప్యాకెట్ల అల్యూమినియం ఫాయిల్ బాక్సుల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఒక్కో ప్యాకెట్‌లో 25 బాక్సులు ఉంటాయి. ఇక ఒక ప్యాక్‌ను రూ.160 కి అమ్మ‌వ‌చ్చు. దీంతో రోజుకు 200 * 160 = రూ.32వేలు వ‌స్తాయి. అదే నెల‌కు అయితే 30 * 32000 = రూ.9.60 ల‌క్ష‌లు వ‌స్తాయి. అందులోంచి స‌గం ఖ‌ర్చులు తీసేసినా స‌గం లాభం వ‌స్తుంది. అంటే రూ.4.80 ల‌క్ష‌ల లాభం వ‌స్తుంది. ఇలా ఈ బాక్సుల త‌యారీ ద్వారా నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు.

Admin

Recent Posts