పద్మ విభూషణ్ గౌరవ గ్రహీత రతన్ టాటా ముంబైలో ఆసుపత్రిలో కన్ను మూసారు. ఆయన జీవితం వృత్తిపరమైన రచనలు అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తి మంత్రంగా మారిపోయాయి. దేశంలో అతి పెద్ద బిజినెస్ గ్రూప్ అయిన టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన కన్నుమూయడంతో ఆయనకు సంబంధించిన వార్తలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మాయ టాటా ఎవరు అనే ప్రశ్న కూడా వస్తోంది.
అసలు మాయ టాటా ఎవరు అనే విషయానికి వస్తే.. మాయ వయసు 34 ఏళ్ళు. బేయెస్ బిజినెస్ స్కూల్, వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలు తీసుకున్నారు. ఆమె కెరియర్ ని టాటా ఆపర్చునిటీ ఫండ్ తో ప్రారంభించారు. తర్వాత టాటా డిజిటల్ లోకి మారారు. టాటా న్యూ యాప్ ని అభివృద్ధి చేయడంలో లాంచ్ చేయడంలో ముఖ్యపాత్రను పోషించారు.
ప్రస్తుతం తోబుట్టులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డ్ లో పనిచేస్తున్నారు. మాయ తల్లి దివంగత టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీ సోదరి దివంగత బిలియనర్ పల్లోంచి మిస్త్రీ కూతురు. టాటా మెడికల్ సెంటర్ ట్రస్టులో ఆమె సేవలు అందిస్తూ ఉంటారు. కలకత్తాలో ఉన్న ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ ని రతన్ టాటా 2011లో మొదలుపెట్టారు. ఆమె ప్రస్తుతం ఆ బాధ్యతలను తీసుకున్నారు. నాణ్యతతో అక్కడ ఉన్న పేషెంట్లను ట్రీట్ చేస్తారు.