Crime News

మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్‌ ఫోన్లు ఇన్నాయి. కొంత మంది దగ్గర విలువైనవి ఉంటే, మరికొంత మంది నార్మల్‌ వి ఉంటాయి. అయితే.. ఈ ఫోన్లు ఒకవేళ పోతే, లేక ఎవరైనా చోరీ చేస్తే ఎలా ? దీనిని ఆలోచించే.. పోలీసులు మొబైల్స్ చోరీ చేస్తే సులువుగా గుర్తించేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ ను, యాప్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ యాప్ లేదా పోర్ట‌ల్ ప్రాంతాల‌ను బ‌ట్టి మారుతుంది. ఎవరిదైనా మొబైల్ పోతే త‌మ స్థానిక పోలీసులు అందుబాటులో ఉంచిన పోర్టల్ లోకి వెళ్లి సంబంధిత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ ఫిర్యాదు నేరుగా సైబర్ సెల్ కు వెళ్తుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్లే అవసరం ఉండదు.

వివరాలు ఇచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ప్రతి మొబైల్ కు IMEI నంబర్ ఉంటుంది. ఆ 15 అంకెల ఈ నెంబర్ ను పోయిన తేదీ, సమయం, కంపెనీ వివరాలు తెలుసుకుంటారు. చాలామంది మొబైల్స్ పోయినా చాలామంది పర్వాలేదని పట్టించుకోవడం లేదట, ఈ కేసుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు మొదలు పెట్టామన్నారు పోలీసులు. అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్, తమిళనాడు, కేరళ, ఒడిశా, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాలు దాటి వెళ్లిన మొబైల్స్ ను సైతం కనిపెట్టామన్నారు.

how police recover stolen mobile phones

ఇప్ప‌టికే ఎన్నో లక్షల విలువైన ఫోన్ల‌ను బాధితులకు అందించామన్నారు. మొబైల్ పోతే సైబర్ సెల్ కు పంపించి వారి ద్వారా దర్యాప్తు చేయిస్తారు. వెబ్ పోర్టల్ ను ఓపెన్ చేశాక రిపోర్టు కంప్లైంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే, లోపల రిపోర్టు కంప్లైంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, కాంటాక్ట్ నంబర్, ఐఎంఈఐ నంబర్లు, జిల్లా, ఊరు, ఎక్కడ పోగొట్టుకున్నది, ఫోన్ మోడల్ వివరాలు నమోదు చేయాలి. కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. రికవరీ అయిన తర్వాత బాధితులు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కు సమాచారం వస్తుంది. ఈ విధంగా ఫోన్ల‌ను రిక‌వ‌రీ చేసి ఇస్తారు. అయితే మీ ఫోన్ కూడా పోతే మీ స్థానిక పీఎస్‌లో అందుబాటులో ఉన్న పోర్ట‌ల్ లేదా యాప్ వివ‌రాలు తెలుసుకుని అందులో మీ ఫోన్ వివ‌రాల‌ను న‌మోదు చేసి కంప్లెయింట్ చేస్తే చాలు, కొద్ది రోజుల్లోనే పోయిన మీ ఫోన్‌ను మళ్లీ వెన‌క్కి పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts