ఆధ్యాత్మికం

అవివాహితులు శివలింగాన్ని పూజించవచ్చా?

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు ఒకరు. మనం ఏ శివాలయానికి వెళ్ళిన అక్కడ మనకు శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. శివుడిని కొలిచే వారు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయంలో మనకు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగం కింద భాగాన బ్రహ్మదేవుడు, మధ్య భాగాన విష్ణు రూపం, పైభాగాన్ని శివ రూపంగా భావిస్తారు.

శివలింగం కింద ఉండే భాగాన్ని యోని భాగం అని కూడా పిలుస్తారు. యోనిల సంఘమైన శివలింగం విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. విశ్వం మొత్తం అందులోని ఉంటుందని భావిస్తారు. ఈ శివలింగం గురించి లింగపురాణంలో ఎన్నో అర్థాలు చెప్పబడింది. లింగం అంటే నాశనం లేనిది, మధురమైనది అనే ఎన్నో అర్థాలు వస్తాయి.

can unmarried people do pooja to lord shiva

ఇటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన లింగాన్ని పూజించడం వల్ల అనంతమైన శక్తి లభిస్తుందని నమ్ముతారు. కానీ పెళ్లి కాని యువతులు శివలింగాన్ని పూజించకూడదు. పెళ్లి కాని యువతులు కేవలం పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న విగ్రహాన్ని పూజించాలని, ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహానికి పూజ చేయటం వల్ల మంచి భర్త దొరుకుతాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts