వైద్య విజ్ఞానం

Urine Smell : మూత్రం దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఇవే కార‌ణాలు కావ‌చ్చు..!

Urine Smell : ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది. అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందంటే.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే ఈ సమస్య పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. కనుక స్త్రీలు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వారి మూత్రం దుర్వాసన వస్తుందంటే.. ఎక్కువగా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లే కారణం అయి ఉంటాయి. ఫంగస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం కూడా దుర్వాసన వస్తుంటుంది. అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరగని వారి మూత్రం కూడా వాసన వస్తుంది.

ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం తినడం, మద్యం సేవించడం వంటి కారణాల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. పలు సందర్భాల్లో జన్యు పరమైన వ్యాధుల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. సాధారణంగా ఇది వంశ పారంపర్యంగా వస్తుంటుంది.

if your urine is getting bad smell then these are the reasons

నిత్యం తగినంత నీటిని తాగకపోయినా, డయాబెటిస్ ఉన్నా, కిడ్నీలలో రాళ్లు, ఇతర కిడ్నీ సమస్యలు, లివర్ వ్యాధులు ఉన్నా.. మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే ఎవరైనా సరే.. మూత్రం దుర్వాసన వస్తుందంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని వారు ఇచ్చే మందులను కచ్చితంగా వాడాలి. దీంతో మూత్రాశయ సమస్యలు, మూత్రం దుర్వాసన రాకుండా ఉంటాయి.

Admin

Recent Posts