ఆధ్యాత్మికం

ఉప్పుతో ఈ విధంగా చేయండి.. ఇంట్లోకి దుష్ట శ‌క్తులు రాకుండా అడ్డుకోవ‌చ్చు..!

ఉప్పును రోజూ స‌హ‌జంగానే మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. ఇది లేకుండా అస్స‌లు ఏ వంటా పూర్తి కాదు. ఉప్పు లేని కూర‌ల‌ను అస్స‌లు తిన‌లేం. అయితే అనేక మ‌తాల‌కు చెందిన వారు దుష్ట శ‌క్తుల‌ను అడ్డుకునేందుకు ఉప్పును వాడుతుంటారు. హిందువులు అయితే ఉప్పుతో దిష్టి తీస్తారు. అలాగే ప‌లు ఇత‌ర మ‌తాల వారు కూడా ఉప్పును భిన్న ర‌కాలుగా దుష్ట శ‌క్తుల‌ను ఎదిరించేందుకు ఉప‌యోగిస్తారు. ఇక జ‌పాన్ వాసులు మాత్రం త‌మ ఇళ్ల ప్ర‌ధాన ద్వారాల ఎదుట ఉప్పును ఉంచుతారు.

చిత్రంలో చూపిన‌ట్లుగా ఒక చిన్న‌పాటి ప్లేట్‌లో ఉప్పును కుప్ప‌లా పోసి ఉంచుతారు. దీని వ‌ల్ల దుష్ట‌శ‌క్తులు ఇళ్ల‌లోకి రావ‌ని వారు న‌మ్ముతారు. అయితే జ‌పాన్ ప్ర‌జలంద‌రూ దీన్ని పాటించ‌రు. విశ్వాసం ఉన్న‌వారే ఇలా చేస్తారు. కానీ చాలా మంది ఇళ్ల బ‌య‌ట అలా క‌నిపిస్తుంది.

do like this with salt evil spirits never come to home

ఇక అలా ఉప్పు ఉంచ‌డాన్ని అక్క‌డ Mori-shio అని పిలుస్తారు. ఉప్పును బ‌య‌ట అలా ఉంచితే అంతా మంచే జ‌రుగుతుంద‌ని, దుష్ట శక్తులు ఇంట్లోకి రావ‌ని, ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని న‌మ్ముతారు. ఇక అక్క‌డ ఇంట్లోని కుటుంబ స‌భ్యులు ఎవ‌రి అంత్య‌క్రియ‌ల‌కు అయినా వెళ్లి వ‌స్తే వారిపై ఉప్పు చ‌ల్లుతారు. దీంతో దుష్ట శ‌క్తులు, దెయ్యాలు వంటివి రాకుండా ఉంటాయ‌ని విశ్వ‌సిస్తారు.

అయితే కేవ‌లం జ‌పాన్ వాసులే కాదు.. చాలా మంది ఉప్పును దుష్ట శ‌క్తుల‌ను పార‌ద్రోలే ప‌దార్థంగా న‌మ్ముతారు. ఉప్పును గుమ్మం వ‌ద్ద గీత మాదిరిగా పోస్తారు. అలాగే హిందూ సంప్ర‌దాయంలో ఉప్పుతో దిష్టి తీస్తారు. ఇలా ఉప్పు దుష్ట‌శ‌క్తుల‌ను త‌రిమేందుకు ప‌నికొస్తుంది. చాలా మంది ఉప్పును ఇందుకుగాను ర‌క‌ర‌కాలుగా ఉప‌యోగిస్తారు.

Admin

Recent Posts