ఆధ్యాత్మికం

శుక్రవారం రోజున ఇలా పూజిస్తే చాలు.. లక్ష్మీదేవి అనుగ్రహం మీవెంటే..!

మన తెలుగు ప్రజలు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఉపవాసాలు పాటిస్తారు. మరికొందరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండడానికి పూజలు చేస్తారు.

కొంతమంది ఎంత సంపాదించినా డబ్బు నిలకడ ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చయిపోతూ ఉంటుంది. ఇలా జరగడానికి ఇంట్లో కొన్ని దోషాలు కూడా ఉంటాయి. ఇలాంటి దోషాలు పోవాలంటే శుక్రవారం రోజు లక్ష్మి దేవికి ఏ విధంగా పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందో తెలుసుకుందాం.. మహాలక్ష్మి దేవికి ఎనిమిది రూపాలు ఉంటాయి. ఆ అష్టలక్ష్మి స్వరూపాలు.. శ్రీ ఆదిలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, శ్రీ ధైర్యలక్ష్మి, శ్రీ గజలక్ష్మి, శ్రీ సంతాన లక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ విద్యాలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి. శుక్రవారం రోజున అమ్మవారి ఎనిమిది రూపాలను, లక్ష్మీదేవి మంత్రాలు పటిస్తూ పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషం మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.

do pooja to lakshmi devi like this on friday

ధనలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఆమె చంచల స్వభావం కలది అని చెప్తారు. కానీ ఏ ఇంట అధర్మం నడుస్తుందో, ఏ ఇంట కలహాలు, దుర్భాషలు ఎక్కువగా ఉంటాయో, ఏ ఇంట శుభ్రత లేకుండా ఉంటుందో ఆ ఇంట ధనలక్ష్మి కొలువుండదు. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించడానికి రాత్రివేళ పవిత్రమైనదిగా భావిస్తారు. శుక్రవారం రోజున రాత్రి 9:00 నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని ఆరాధించాలి. అష్టలక్ష్మిలకు సంబంధించిన మంత్రాలను చదువుతూ ఇంట్లోనే ఎనిమిదిక్కులలో 8 దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts