sports

రిషబ్ పంత్ లాగే ప్రమాదాలకు గురైన స్టార్ క్రికెటర్లు వీరే అని తెలుసా ?

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు గ‌తంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళన చెందారు. ఉత్తరాఖండ్ లోని రూర్కి ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. ఢిల్లీ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. అయితే అదృష్ట‌వ‌శాత్తూ ఈ ప్ర‌మాదం నుంచి పంత్ త్వ‌ర‌గా కోలుకుని ఫిట్ నెస్ సాధించి తిరిగి అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక రిషబ్‌ పంత్‌ లాగే కొంద‌రు క్రికెట‌ర్లు ప్రాణాల మీదుకు తెచ్చుకున్నారు. అలాగే కొంత మంది మరణించారు. అలాంటి క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రు ఫ్లింటాఫ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బీబీసీలో ప్రసారమయ్యే టాప్ గేర్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

యువరాజ్‌ సింగ్‌ లంగ్‌ క్యాన్సర్‌ నుంచి బయట పడ్డాడు. ఈయ‌న‌ది యాక్సిడెంగ్ కాక‌పోయినా క్యాన్స‌ర్ అంటే ప్రాణాంత‌క‌మైన‌ది క‌నుక దాన్నుంచి ఈయ‌న త‌న ఆత్మ విశ్వాసంతో కోలుకుని బ‌య‌ట ప‌డ్డారు. పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ కారుపై ఓ వ్యక్తి గతంలో కాల్పులు జరిపాడు. ఆ సమయంలో, చాలా చాకచక్యంగా వసీమ్‌ బయటపడ్డాడు. ఆసీస్‌ ప్లేయర్‌ మాథ్యూ వేడ్ కూడా వృషణ క్యాన్సర్ నుంచి బతికిపోయాడు. లంక క్రికెటర్‌ దినేష్ చండిమాల్ సునామీ నుంచి తప్పించుకున్నాడు. 2004 లో శ్రీలంలో వచ్చిన సునామీ నుంచి బయట పడ్డాడు. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్ క్లార్క్ చర్మ క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు. శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ కూడా సునామీ నుంచి తప్పించుకున్నాడు. 2004 లో శ్రీలంలో వచ్చిన సునామీ నుంచి బయట పడ్డాడు.

these are the cricket players just like rishabh pant got accidents

బరోడా ఉమెన్స్ జట్టుతో వెళ్తున్న బస్సు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వెళ్లే దారిలో ప్రమాదానికి గురైంది. తాటి చెట్లపాలెం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు బరోడా మహిళా క్రికెటర్లకు తీవ్ర గాయాలు కాగా, మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన మాజీ అంపైర్ రూడీ (73) రివర్ డేల్ లో ఉన్న గోల్ఫ్ కోర్స్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్ కు గురైంది. దీంతో ఆయ‌న ప్రాణాలు వ‌దిలారు. 1961లో ఆక్స్ఫర్డ్ సస్సేక్స్ లో ఆడుతుండగా భారత్ కు చెందిన మాక్ పటౌడి ఇంటికి వెళ్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆయన ఆటోలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీ కొట్టింది. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ప్రాణాలకు ప్రమాదం తప్పినా కుడి కంటికి తీవ్ర గాయం అయింది.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కోలీ స్మిత్ 26 సంవత్సరాల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని సహచరులు టామ్ డ్యూడ్ని మరియు గ్యారీ సోబర్స్ తో కలిసి ఒక చారిటీ గేమ్ కోసం లండన్ కు వెళ్తుండగా స్టాఫ్ఫోర్డ్ షైర్ లో పశువుల ట్రాక్టర్ ను వారి ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కోమాలో ఉండి మరణించాడు. వెస్టిండీస్ కు చెందిన మరో క్రికెటర్ రుణాక మార్టన్ 2012లో తన కారు పోల్ ను ఢీకొట్టడంతో ట్రినిడాల్ లో మరణించాడు. భారత్ కు చెందిన స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే నడుపుతున్న కారు మెరైన్ డ్రైవ్ లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అవగా కారులో ఉన్న స్నేహితుడు మరణించాడు. బహతులే కుడి కాలికి రాడ్ అమర్చారు. అయితే ఒక సంవత్సరం తర్వాత అతను తిరిగి క్రికెట్ ఆడాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మరియు రెండుసార్లు ప్రపంచ కప్ విజేత ఆండ్రు సైమాండ్స్ కారు ప్రమాదంలో మరణించారు.

Admin

Recent Posts