ఆధ్యాత్మికం

వినాయ‌కుడిని ఇలా పూజిస్తే.. శ‌ని దోషాలు పోతాయి..!

ముక్కోటి దేవతలలో వినాయకుడు ఎంతో ప్రత్యేకం. మొదటి పూజ్యుడిగా పూజలందుకునే వినాయకుడికి ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ముందుగా పూజ చేస్తే ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భావిస్తారు. అదేవిధంగా బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. బుధవారం రోజు స్వామివారికి దుర్వార పత్రాలతో, గరికతో పూజ చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

గణపతి పూజలో తప్పకుండా ఉండవలసినది గరిక. గరికతోపాటు గన్నేరు పుష్పాలతో స్వామి వారికి పూజ చేయటం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. శని దోషాలతో బాధపడేవారు వినాయకుడికి పత్రాలతో పూజ చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి శని నుంచి విముక్తి కలుగుతుంది.

pray to lord ganesha like this to remove dosham

మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు మాటిమాటికీ అడ్డంకులు ఏర్పడితే దుర్వార పత్ర పూజ చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోయి శుభ కార్యాలు పూర్తి అవుతాయి. బుధవారం స్వామివారికి గరికతో పూజ చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతాము. అదేవిధంగా వినాయకుడి పూజలో తులసి మాలలను ఎటువంటి పరిస్థితులలో కూడా ఉపయోగించకూడదు.

Admin

Recent Posts