వైద్య విజ్ఞానం

ఇయ‌ర్ ఫోన్స్‌ను అధికంగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే మీకు ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..

ప్రస్తుతం ఇయర్ ఫోన్స్ వాడ‌కం విపరీతంగా పెరిగింది. ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడంతో, పాటలు విందామనో, ఫోన్ మాట్లాడుతూనో ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకునే కనిపిస్తారు. అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదు. నిజానికి రేడియేషన్ తగ్గించడానికి ఇయర్ ఫోన్స్ మంచివే అయినా, వాటిని ఎక్కువ సమయం చెవిలో పెట్టుకోవడమే కరెక్ట్ కాదు. అది మిమ్మల్ని చెవిటివారిగా చేసే అవకాశం ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఎక్కువ సేపు పాటలు వినడం, కాల్ మాట్లాడడం వంటివి చేస్తుంటే వినికిడి సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చెవుల్లో ఇన్ఫెక్షన్ రావడమే దీనికి ప్రధాన కారణం. అలాగే ఇయర్ ఫోన్స్ ఇతరులతో పంచుకున్నప్పుడు శానిటైజర్ తో శుభ్రపర్చుకోవడం మంచిది.

if you are using ear phones or buds excessively you will get these health problems

ఇయర్ ఫోన్స్ తరచుగా వాడడం వల్ల వినికిడి 40డెసిబుల్స్ నుండి 50డెసిబుల్స్ కి తగ్గుతుంది. దూరం నుంచి వచ్చే శబ్దాలు వినడంలో ఇబ్బంది ఏర్పడి, చెవిటి సమస్యలకి దారితీస్తుంది. మీరు వాడే ఇయర్ ఫోన్లలో అధిక డెసిబుల్ సామర్థ్యం ఉంటుంది. వీటిని వాడుతూ ఉంటే వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ వాల్యూమ్ తో బయట శబ్దాలు మీకు వినబడకుండా పాటలు వింటుంటే చాలా తొందరగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. అంతే కాదు దీనివల్ల మానసిక సమస్యలు, శారీరక సమస్యలు గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

మనసుపై కూడా చెడు ప్రభావాన్ని చూపే ఇయర్ ఫోన్లని ఎక్కువగా వాడకండి. బస్సులో వెళ్తున్నప్పుడు టైమ్ పాస్ కావడానికి మీరు ఉపయోగించే ఇయర్ ఫోన్స్, మీకు అనేక రకాల ఇబ్బందులని తెచ్చిపెడతాయి. అందుకే ఏది వాడినా ఎంత మేరకు వాడాలో తెలియాలి. లేదంటే ఆ తర్వాత ఇబ్బంది పడేది మీరే.

Admin

Recent Posts