ఆధ్యాత్మికం

శివ మాన‌స పూజ అంటే ఏమిటి..? దీన్ని ఎలా చేయాలి..?

శివ..శివ.. సకల శుభకారకుడు, ఐశ్ర్య ప్రదాతగా, భక్తుల పాలిట భోలా శంకరుడు శివుడు. దేవుళ్లందరిలో అత్యంత సులభంగా పూజచేసే అవకాశం ఉన్న దేవుడు ఆయన. కాసింత జలం, భస్మం, తుమ్మిపూలు, మారేడు, గన్నేరు వంటి సులభంగా, అతి సామాన్యుడికి దొరికే వాటితో అర్చించినా అనుగ్రహించే భగవానుడు శివుడు. ఆ సర్వమంగళ కారకుడి శివార్చన, లేదా ఏ దేవతార్చనైనా మానవులకు మంచి ఫలితాలనిస్తాయంటారు. అయితే అనేక కారణాలవల్ల అందరికీ ప్రతి రోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు. వృధ్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల, ప్రయాణంలో, ఇలా కూర్చుని అభిషేకమూ, అర్చనా చేసే అవకాశం లేక పోయినా, చెయ్యాలనే తపన మాత్రం వున్నవాళ్ళు మరి ఏం చెయ్యాలి? దీనిపై మన ధర్మ గ్రంధాలు ఏం చెబుతున్నాయి?

భగవంతుని పూజలో మానసిక పూజే విశేషమయినది. మనసులో భగవంతుని నిలుపుకోవటం అలవాటు చేసుకోవటానికి, మనసు నిశ్చలంగా వుండటానికి ప్రత్యక్షంగా విగ్రహాన్ని పూజించాలి. అలా కుదరనప్పుడు, మన మానసిక శక్తిని పరీక్షించుకోవటానికి, భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకోవటానికి భగవంతుడు కల్పించిన అవకాశంగా దాన్ని భావించి మానసిక పూజ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలి? భగవంతుడు అక్కడ వున్నాడని భావించి ఆయనకి రత్నసింహాసనం వెయ్యాలి.

what is shiva manasa pooja and how to do it

ఆకాశగంగని తెచ్చి మనసారా అభిషేకించాలి. వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి. సుగంధ భరితమైన పూవులతో, మారేడు దళాలతో పూజించాలి. ధూపం, దీపం అన్నీ సమర్పించాలి. షడ్రషోపేతమైన వివిధ భక్ష్యభోజ్యాలను, మధుర ఫలాలను నివేదించాలి. స్వామీ, నేను చేసిన వివిధ సపర్యలు స్వీకరించి నాపై దయచూపమని వేడుకోవాలి. బాహ్యంగా విశేష పూజ చేసే అవకాశం లేనివారు బాధపడకుండా భగవంతుడు అది మనకిచ్చిన అవకాశంగా తీసుకుని భగవంతుని మనసులో నిలుపుకుని పూజించవచ్చు. శివమానస పూజను అందరూ చేసుకోవచ్చు.

Admin

Recent Posts