ఆధ్యాత్మికం

Lemon Garland To Maa Kaali : అమ్మవారికి నిమ్మకాయ దండలని ఎందుకు వేస్తారు..? కారణం ఏమిటో తెలుసా..?

Lemon Garland To Maa Kaali : ప్రతీ ఊళ్ళో కూడా అమ్మవారి ఆలయాలు ఉంటాయి. దుర్గా దేవి ఆలయం అని, గ్రామ దేవత ఆలయం అని ఇలా ఎన్నో అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. అయితే అమ్మవారిని మనం ఎప్పుడైనా గమనించినట్లయితే, అమ్మ వారికి నిమ్మకాయల దండల్ని వేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లోనే కాదు బోనాలు పండగ, దసరా పండుగ వంటివి జరిగినప్పుడు కూడా అమ్మవారికి నిమ్మకాయ దండల్ని వేస్తూ ఉంటారు. అయితే ఎందుకు అమ్మవారికి నిమ్మకాయ దండలు వేస్తారు..? దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

చాలా మంది కారణాలు ఏమిటి అనేది తెలుసుకోకుండా, పూర్వీకులు పాటించారు మనము పాటించాలని అలానే వారు కూడా పాటిస్తూ ఉంటారు తప్ప ఎందుకు అలా చేస్తున్నారు అనేది పట్టించుకోరు. కానీ నిజానికి ఇలాంటి పురాతన పద్ధతుల‌ వెనుక పెద్ద కారణమే ఉంటుంది. ఎక్కువగా నిమ్మకాయ దండల్ని గ్రామ దేవతలకి వేస్తూ ఉంటారు.

why lemon garland is given to durga devi

లక్ష్మీ దేవి, సరస్వతి దేవి కి ఇలాంటి దండల్ని వేయరు. శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు, రక్షణ బాధ్యతల్ని కలిగి ఉంటుంది. నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లయకారిణి శక్తి కదా అమ్మవారు, కాలస్వరూపమై దుష్టశక్తుల పాలిట సింహ స్వప్నమైన దేవికి తామస గుణం ఉంటుంది. అయితే అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె బలిప్రియ. అంటే బ‌లి కోరుతుంద‌న్న‌మాట‌.

ఆ బలికి మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సు కి ప్రతీక కూష్మాండం. అంటే గుమ్మడికాయ. అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటాము. అలానే అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండని, పులుపుగా ఉండే పులిహార ని కూడా నైవేద్యంగా పెడతాము. అలా చేస్తే, అమ్మవారు శాంతిస్తారు. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం జరుగుతుంది.

Admin

Recent Posts