సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నిత్యం రచ్చ చేస్తోంది అనసూయ. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంతో పాటు తనకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటోంది. జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువైన అనసూయ.. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించింది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన అనసూయ.. వెండితెరపై తన టాలెంట్ చూపిస్తోంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ సెట్స్ మీద బిజీ బిజీ అవుతోంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీ కొనసాగిస్తోంది.
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప సినిమాలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్ గా దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నిత్యం రచ్చ చేస్తోంది. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంతో పాటు తనకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతుంటాయి. జోరువానలో తన భర్తతో కలిసి నడిరోడ్డుపై షటిల్ ఆడుతూ కనిపించింది అనసూయ. పొట్టి దుస్తుల్లో ఆమెనలా చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. ఇక మీ పక్కింట్లో అద్దెకు దిగుతాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం చూడొచ్చు.
ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 3 సినిమాలో నటిస్తోంది. విమానం సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసల అందుకుంది అనసూయ. అదేవిధంగా పెదకాపు మూవీలో అనసూయ రోల్ కి మంచి మార్కులు పడ్డాయి. సింబా మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. పుష్ప 3 సినిమాలో అనసూయ రోల్ మేజర్ అట్రాక్షన్ అవుతుందనే టాక్ ఉంది. ఈ సినిమాలో అనసూయతో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారట డైరెక్టర్ సుకుమార్. త్వరలో పుష్ప 3 షూటింగ్ జరగనుంది.