వినోదం

ఉదయ్ కిరణ్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే కెరీర్ నాశనం అయ్యిందా..?

ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ మొదటి మూడు సినిమాలకే స్టార్ అయి కూర్చున్నాడు. చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి చిత్రాలతో వరుస హిట్లని అందుకున్నాడు. తక్కువ కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు ఉదయ్ కిరణ్. అతనితో సినిమా చేస్తే నష్టం రాదు అనే ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని అప్పట్లో అమ్మాయిలా డ్రీమ్ బాయ్ గాను వెలిగారు. అయితే ఉదయ్ కిరణ్ కెరీర్ ఎంత త్వరగా తారాస్థాయికి చేరిందో అంతే వేగంగా కిందకు జారింది.

దానికి ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవడం ఒక కారణం అయితే.. మరో కారణం పర్సనల్ లైఫ్ లో జరిగిన అనేక విషయాలు. వచ్చిన ఆఫర్లను కూడా దర్శకనిర్మాతలు వెనక్కి తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఉదయ్ కిరణ్ చేసిన ఒక తప్పు వల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని ఓ వార్త వైరల్ అవుతుంది. వరుస హిట్ సినిమాలతో ఊపు మీద ఉన్న ఉదయ్ కిరణ్ క్రమంగా జరిగిన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలం అవడం, మాస్ హీరోగా రాణించలేకపోవడం వంటివన్నీ ఉదయ్ కిరణ్ కెరీర్ ని దెబ్బతీశాయి. సరైన కథలు ఎంపిక చేసుకోలేకపోవడం, కాలానుగుణంగా లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడలేకపోవడంతో కెరీర్ దెబ్బతిన్నదని టాక్ ఉంది.

because of this mistake uday kiran career is spoiled

సాధారణంగా అప్పట్లో మాస్ హీరోలకే ఎక్కువగా క్రేజ్ ఉండేది. ఓ ఇంటర్వ్యూలో కూడా తెలుగు హీరో త్రిగుణ్ అదిత్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తరుణ్, ఉదయ్ కిరణ్ చేసిన తప్పులను తాను చేయనని అన్నారు. ఈ యంగ్ హీరో చేసిన కామెంట్లు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ చిత్రాలకు బ్రేక్ ఇచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ సై సినిమాని రిజెక్ట్ చేసి ఉండకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Admin

Recent Posts