వినోదం

Bobbilipuli Movie : ఎన్టీఆర్‌, దాస‌రి కాంబోలో వ‌చ్చిన సెన్సేష‌న‌ల్‌ చిత్రం బొబ్బిలిపులి.. తెర‌వెనుక అసలు ఏం జ‌రిగిందంటే..?

Bobbilipuli Movie : ఎన్టీఆర్ అంటే డైలాగ్స్.. డైలాగ్స్ అంటే ఎన్టీఆర్. అలాంటి ఆయనకి మాటల తూటాలు పేల్చే దాసరి లాంటి దర్శకుడు, రచయిత దొరికితే ఇంకా ఎలా ఉంటుంది? అవును.. ఎలా ఉంటుందో బొబ్బిలిపులి సినిమా చూపించింది. ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికతో వచ్చిన ఐదో చిత్రం ఇది. ఈ సినిమాని 1982 జూలై 9న విడుదల చేయగా అన్ని సెంటర్లలో సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా చెరిపేసి కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమాకి 40 ఏళ్లు నిండాయి. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో మొత్తంగా 5 చిత్రాలు తెరకెక్కాయి.

మొదటి చిత్రం మనుషులంతా ఒక్కటే కాగా చివరి చిత్రం బొబ్బిలిపులి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా శ్రీదేవి నటించింది. లాయర్ విజయగా శ్రీదేవి నటన అద్భుతం. ఈ సినిమా తరవాత ఆమె నటన స్థాయి మరింత ఎత్తుకు చేరుకుంది. ఈ సినిమాని హీరో వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ నిర్మించారు. జేవి రాఘవులు ఈ సినిమాకి సంగీతం అందించగా, ప్రతి పాట సూపర్ డూపర్ హిట్టే.. ముఖ్యంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ పాట నేటికి ఎవర్ గ్రీన్. ఈ పాటను దాసరి నారాయణ రావు రాయగా ఎస్పీ బాలు ఆలపించారు.

bobbilipuli movie interesting facts ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన సమయానికి దాసరి తెరకెక్కించిన చిత్రాలు ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితంలో కీ రోల్ పోషించాయి. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రచారంలో ఉండగా ఈ సినిమా విడుదల అవ్వడం ఎన్టీఆర్ కి బాగా ప్లస్ అయింది. ఆ తరవాత ఎన్టీఆర్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ సినిమా మొత్తం 39 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచింది. ఇక సినిమా కోర్టులో వచ్చే సన్నివేశం సినిమాకి బిగ్గెస్ట్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. వీటిని ఏకంగా క్యాసేట్లుగా అమ్మేవారు. ప్రేక్షకులు కూడా అవి విరగబడి కొనేవారు. ఈ సినిమాకి వేటూరి సుందరరామమూర్తితో కలిసి దాసరి నారాయణరావు కూడా పాటలు రాశారు. బొబ్బిలిపులి డ్రస్ అప్పుడో ఫ్యాషన్.. చిన్నపిల్లల కూడా ప్రత్యేకంగా ఆ డ్రస్ ధరించేవారు.

Admin

Recent Posts