వినోదం

Krishna : ఎన్టీఆర్ వ‌ద్ద‌న్న క‌థ‌తో సినిమా చేసి.. సూపర్ డూప‌ర్ హిట్ కొట్టిన కృష్ణ‌.. అదేంటంటే..?

Krishna : టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో రెండు మూల స్తంభాలు ఏంటంటే అవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని చెప్ప‌వచ్చు. ఈ ఇద్ద‌రు తెలుగు సినిమా ప‌రిశ్రమ స్థాయిని పెంచ‌డానికి ఎంత‌గానో కృషి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. 1982లో కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం “ఈనాడు” సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి చాలా ఉపయోగపడింది. ఎన్నికలు మూడువారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్ర‌చారానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది.

ఎన్టీఆర్, కృష్ణ ఈ ఇద్ద‌రు హీరోలు ఎన్నో విభిన్నమైన కథలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని ఉన్నారు. కృష్ణ అంటే కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. కృష్ణ కెరీర్ లో విజయవంతమైన సినిమాల్లో ముఖ్య‌మైన చిత్రం” అల్లూరి సీతారామరాజు ”. ఈ సినిమాలో కృష్ణ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్ర చూస్తే నిజమైన అల్లూరి సీతారామరాజు అన్నట్టే ఉంటుంది. అలా నటించడమే కాదు ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు వింటే తెలియని గూస్బంప్స్ వస్తాయి. అయితే కృష్ణ ఆ పాత్ర చేయడం వెన‌క ఓ కార‌ణం ఉంది.

actor krishna made super hit movie with sr ntr rejected story

అసాధ్యుడు మూవీ లో కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్ర వేశారు. ఈ చిత్రానికి రామచంద్ర రావు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు కథ సిద్ధం కాగా దర్శకుడు రామచంద్రరావు ముందుగా ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లారట. ఆయ‌న ఈ ప్రాజెక్ట్‌కి ఇంప్రెస్ అయిన‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల‌న సినిమా చేయ‌క‌పోవ‌డంతో రామచంద్రరావు ఈ కథను కృష్ణ దగ్గరికి తీసుకు వచ్చారని, దీంతో హీరో కృష్ణ ఒప్పుకోవడంతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే సినిమా 70 శాతం షూటింగ్ పూర్తవ్వగానే కొన్ని కారణాల వల్ల రామచంద్ర రావు క‌న్నుమూసారు.

ఈ క్ర‌మంలో సినిమా మిగతా భాగాన్ని కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో, కృష్ణ పద్మాలయ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మించింది.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి షోకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లోనే అత్యుత్తమ మైన చిత్రంగా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసింది. అయితే ఒకానొక దశలో కృష్ణను ఎన్టీఆర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.. ఆర్థికంగానూ దెబ్బ కొట్టారు. దీంతో కృష్ణ ఎన్టీఆర్ ను బహిరంగంగానే వ్యతిరేకించారు.. మరి ముఖ్యంగా సాహసమే నా ఊపిరి అనే సినిమాలో రంగా హత్యను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఘనత కృష్ణకే దక్కుతుంది అని చెప్పాలి. ఇక తన సినిమాలు ఫ్లాఫ్ అయితే నిర్మాతలకు రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయ‌డం వ‌ల‌న కృష్ణ చాలా అప్పుల పాల‌య్యారు.

Admin

Recent Posts