వినోదం

Chiranjeevi : బాల‌కృష్ణ సినిమా హిట్ కావ‌డానికి చిరంజీవి అంత ప‌ని చేశాడా..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. తెలుగు నాట వీరిద్దరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి సినిమాలకున్న పోటీ మరే హీరోకు ఉండదనేది అంద‌రికి తెలిసిన వాస్త‌వం. గ‌త కొన్ని శ‌తాబ్ధాలుగా ఈ ఇద్ద‌రు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నారు. అభిమానుల విషయంలో ఇద్దరిలో ఎవ్వరినీ తక్కువ చేయడానికి లేదు. వీరి సినిమా ఒక సీజన్‌లో విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. అందులోనూ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే పండగ సీజన్‌లో వీరిద్దరు బాక్సాఫీస్ బరిలో 11 సార్లు తలపడ్డారు.

1985 నుంచి ఇప్పటి వరకు బరిలో పోటీ పడిన వీరు ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.ఈ రెండు చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డం విశేషం. అయితే కెరీర్ ప‌రంగా ఇద్ద‌రి మ‌ధ్య ఎంత పోటీ ఉన్న‌ప్ప‌టికీ మంచి స్నేహం ఉంటుంది. చిరంజీవి ప‌లు సార్లు బాల‌య్య‌కి అండ‌గా నిలిచారు. బాల‌య్య హీరోగా న‌టించిన గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి సినిమా ఫంక్ష‌న్ కు మెగాస్టార్ చిరంజీవి వ‌చ్చారు. బాల‌య్య చిరుకు ఫోన్ చేసి స్వ‌యంగా ఆయ‌న‌ను ఆహ్వానించడంతో ఇద్ద‌రూ క‌లిసి ఆ ఫంక్ష‌న్ లో సంద‌డి చేశారు.

chiranjeevi helped balakrishna movie

చిరంజీవి బాల‌య్య ఒకే వేదిక‌పైకి రావ‌డంతో మూవీకి చాలా మైలేజ్ వ‌చ్చింది. అయితే గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సినిమా కంటే ముందు బాల‌య్య మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు కూడా చిరు స‌పోర్ట్ చేశార‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఆ సినిమా మ‌రేదో కాదు ఆదిత్య 369 .ఈ మూవీకి సైతం చిరంజీవి ప్ర‌మోష‌న్స్ చేశారు. సినిమా విడుద‌ల త‌ర‌వాత ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా నిర్మాత ఓ యాడ్ ను తీయాల‌నుకోగా, ఆ యాడ్ కోసం చిరును సంప్ర‌దించ‌గా ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పారు. ఆ యాడ్ దూర‌ద‌ర్శ‌న్ లో ప్ర‌సారం కాగా దాని ప్ర‌భావం తో కూడా సినిమాకు మైలేజ్ పెరిగింది. ఆ విధంగా బాల‌య్య‌ సినిమాకి చిరంజీవి ప్ర‌మోష‌న్ చేశారు.

Admin

Recent Posts