వినోదం

Chiranjeevi : రెండేళ్ల పాటు ఒకే చొక్కాను ఉతక్కుండా ధరించిన చిరు.. ఇంతకీ మెగాస్టార్ ఎందుకలా చేశారు..?

Chiranjeevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను తనదైన నటన, డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎంతటి స్టార్ హీరో అయినా కెరీర్ లో ఫ్లాప్ లు తప్పవు.

మెగాస్టార్ లో కెరీర్ లో కూడా ఫ్లాప్ లు ఉన్నాయి. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన అంజి సినిమా మాత్రం మెగాస్టార్ ను తీవ్ర నిరాశ పరిచింది. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. 1997 లోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అప్పటి నుండి మీడియాలో అంజి సినిమా వార్తలు తరచూ కనిపించేవి. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి మాత్రం 7 ఏళ్ళు పట్టింది.

chiranjeevi wore this shirt without washing for 2 years

అప్పట్లోనే రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 2004 లో విడుదల అయ్యింది. సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్‌ ను ఉపయోగించారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారట. ఆ తరవాత అరుంధతి సినిమాతో కోలుకున్నారట. అయితే ఈ సినిమాలో మాసిన షర్ట్ తో కనిపించడానికి చిరంజీవి ఒకే షర్ట్ ను ఏకంగా రెండేళ్ల పాటు ఉతక్కుండా వేసుకున్నారట.

Admin

Recent Posts