వినోదం

Sr NTR : రాత్రి పూట శ్మ‌శానంలో పూజ‌లు చేస్తూ ప‌డుకున్న ఎన్టీఆర్.. ఎందుక‌లా..?

Sr NTR : సీనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా చరిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయం లిఖించుకున్న విష‌యం తెలిసిందే. ఒకే జాన‌ర్‌లో కాకుండా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ డిఫ‌రెంట్ సినిమాలు చేశారు. ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో ఉన్నతమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తి చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎన్నో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టి పేద‌వారికి అండ‌గా నిలిచారు. ఇక భారతీయ సంస్కృతి, దైవ సిద్ధాంతాల పైన మంచి పరిజ్ఞానం ఉన్న ఎన్టీఆర్ ఒకానొక సమయంలో క్షుద్ర పూజలు చేస్తారంటూ, స్మశానంలో పూజలు చేయడం, రాత్రి పూట చీర కట్టుకుని స్మశానం లోనే పడుకునే వారంటూ అప్ప‌ట్లో తెగ ప్ర‌చారం న‌డిచింది.

ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్టు భరద్వాజ స్పందిస్తూ అప్పట్లో ఎన్టీఆర్ పై వచ్చిన ఈ వార్తలో అస్స‌లు నిజం లేదు కేవలం ఆరోపణలు మాత్రమే. ఆయన పేరును పాడు చేయడానికి ఆనాటి ప్రతిపక్షాలు చేసిన కుట్ర అనే చెప్పాలి.. నిజమైన ఎన్టీఆర్ ఆలోచనలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు అంటూ తన మ‌న‌సులోని మాట‌ని మీడియా ముందు వ్యక్తపరిచారు.నిజమైన ఎన్టీఆర్ ఆలోచనలు తెలియాలంటే కుర్థళం పీఠాధిపతి ప్రసాదరాయ కులపతి ప్రస్తుతం మౌనస్వామి అని పిలిచే ఆయన ఒకసారి ఎన్టీఆర్ గారు ఇచ్చిన ప్రసంగం గురించి చెప్పి కొత్త ఎన్టీఆర్ ను లోకానికి పరిచయం చేసారు అంటూ భరద్వాజ గారు వివరించారు.

did sr ntr really done pooja on cemetary

ఎన్టీఆర్ గారిపై త్రిపురనేని రామస్వామి గారి సిద్ధాంతాల ప్రభావం సినిమాల్లోనూ అలానే త‌న పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలో స్పష్టంగా కనిపిస్తుంది.ఎన్టీఆర్ గారిలో కొంత ద్రావిడ సిద్ధాంతపు ఆలోచనలు కూడా ఎక్కువ, ఆయనను ఆ వైపుగా ప్రభావితం చేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి గారు అని చెప్పాలి.. ఎన్టీఆర్ గారు ఓ సందర్భంలో బ్రాహ్మణ అంటే కులం కాదు, బ్రహ్మ జ్ఞానం తెలిసిన శూధ్రుడైనా బ్రాహ్మణుడే అంటూ శంకర పద్యం ను ఉదాహరించి దాదాపు రెండు గంటల పాటు భారతీయ సంస్కృతి వేదాల గురించి మాట్లాడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.. ఎన్టీఆర్ గారు మూఢనమ్మకాలను అస్సలు నమ్మేవారు కాదు. దైవత్వం అంటే మాత్రం అపారమైన నమ్మకం ఉండేది అంటూ భరద్వాజ ఎన్టీఆర్ గొప్పతనాన్ని గురించి చెప్పుకొచ్చారు.

Admin

Recent Posts