వినోదం

Soundarya : సహజ న‌టి సౌంద‌ర్య ల‌వ్ స్టోరీ గురించి తెలుసా..?

Soundarya : అందం, అభినయం, తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ. సహజ సౌందర్యంతో.. పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ఒకదశలో సౌత్‌లో నంబర్‌ వన్‌ హీరోయిన్ గా నిలిచింది. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతుండగానే అందివచ్చిన అవకాశంతో సినీరంగంలోకి ప్రవేశించింది. సౌంద‌ర్య అస‌లు పేరు సౌమ్య. ఆమె తండ్రి స్నేహితుడు ఒక‌త‌ను 1992లో గంధ‌ర్వ చిత్రంలో న‌టించేందుకు అవ‌కాశం ఇచ్చారు. ఇక‌ అమ్మోరు చిత్రం విజ‌య‌వంతం అయిన త‌రువాత ఆమె చ‌దువును మ‌ధ్య‌లోనే ఆపివేసింది.

సౌందర్య టాలీవుడ్ తో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ళ‌యాళం, హిందీలో కూడా న‌టించింది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఉండ‌టం స‌ర్వ‌సాధార‌ణం. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న సౌంద‌ర్య‌కు అప్ప‌ట్లో చాలా ఎఫైర్స్ ఉన్నాయ‌ని.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గుస‌గుస‌లు వినిపించాయి. అప్ప‌ట్లో సౌంద‌ర్య కెరీర్ హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్న త‌రుణంలో సౌంద‌ర్య.. విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు.. వెంక‌టేష్‌, సౌంద‌ర్య న‌టించిన రాజా, పెళ్లి చేసుకుందాం, జ‌యం మ‌న‌దేరా ఇలా ప్రతి సినిమా హిట్ అయింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉన్న‌ద‌ని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. రామానాయుడు కొడుకు అనో ఏమో తెలియ‌దు కానీ, ఈ విష‌యం మాత్రం బ‌య‌ట‌కు రాలేదు.

do you know about soundarya love story

ఆ త‌రువాత సౌంద‌ర్య జ‌గ‌ప‌తిబాబుతో ఎక్కువ సినిమాలు చేసింది. దీంతో సౌంద‌ర్య‌కు, జ‌గ‌ప‌తిబాబుకు మ‌ధ్య ఎఫైర్ న‌డించిందని సినీ ప‌రిశ్ర‌మ కోడై కూసింది. అప్పుడు దీనిని ఎవరూ ఖండించ‌క‌పోవ‌డంతో ఇది నిజ‌మేన‌ని అనుకున్నారు అంద‌రూ. సౌంద‌ర్య చ‌నిపోయింద‌నే ఆలోచ‌న నుంచి కోలుకోవ‌డానికి జ‌గ‌ప‌తిబాబుకు చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. అందుకే ఆ స‌మ‌యంలో సినిమాల‌కు కొద్ది రోజులు దూరంగా ఉన్నాడ‌ట‌. ఎన్నో అవార్డులతోపాటు లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సౌందర్య ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళుతూ 2004 ఏప్రిల్‌ 17న విమాన ప్రమాదంలో మరణించింది. భౌతికంగా దూరమైనా ఆమె సినిమాలు ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

Admin

Recent Posts