వినోదం

ఉదయ్ కిరణ్ సోదరి టాలీవుడ్ టాప్ సింగర్..!! ఆమె ఎవరో మీకు తెలుసా..?

హీరో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. టాలీవుడ్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుడు ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా తనువు చాలించి ఎనిమిది ఏళ్ల పైనే అవుతుంది. అయితే ఆయన తనువు చాలించడానికి కారణాలేవో ఇప్పటికీ తెలియనప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ నిలిచే ఉన్నారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ఉదయ్ కిరణ్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.

అందుకే ఉదయ్ కిరణ్ ను లవర్ బాయ్ గా పిలిచేవారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకి ఉదయ్ కిరణ్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారంటే ఉదయ్ కిరణ్ రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో ఉదయ్ కిరణ్ చేతిలో పది సినిమాలు ఉండేవి. అలాంటి స్టార్ హీరో జీవితంలోకి అనుకోని కష్టాలు ఎంట్రీ ఇచ్చాయి. అలా చివరికి చిన్న వయసులోనే కన్నుమూశారు. అయితే ఉదయ్ కిరణ్ కి దగ్గర బంధువు సోదరి వరుస ఒకరు టాలీవుడ్ లో టాప్ సింగర్ అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె ఉదయ్ కిరణ్ చిన్నమ్మ కూతురు.

do you know uday kiran has a sister

ఆమె పేరు పర్ణికమాన్య. తెలుగు టాప్ సింగర్ లలో ఈమె ఒకరు. ఈమె తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ రభస చిత్రంలో గరంగరం చిలక, అలాగే పోతే పోనీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కవచం సినిమాలలో కూడా ఆమే పాటలు పాడారు. ఈ సినిమాలే కాక చాలా సినిమాలలో పాటలు పాడి మంచి గుర్తింపుని సాధించారు. ప్రస్తుతం పర్ణిక మాన్య పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యారు.

Admin

Recent Posts