వినోదం

ఉదయ్ కిరణ్ మరణించిన తరావత ఆయన భార్య విషిత ఎక్కడ ఉంటుందో…? ఏం చేస్తుందో తెలుసా ..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. ఆయన చనిపోయి ఇప్పటికి అనేక సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు. టీవీ లో ఉదయ్ కిరణ్ సినిమా వచ్చింది అంటే ఇప్పటికి అభిమానులు ఎగబడి చూస్తారు..

ఆయన వార్తలు సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. అయితే ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి సోషల్ మీడియాలో అప్ప‌ట్లో ప్రచారం జరిగింది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత విషిత అమెరికా వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఉదయ్ కిరణ్ ఒక పార్టీలో పరిచయమైన అమ్మాయి ని పెళ్లి చేసుకున్నారు. సినీ అవకాశాలు లేకపోయినా సరే వారిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. అయితే ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ కి వెళ్ళాడు. అతన్ని మామూలు మనిషిని చేయడానికి ఆమె ఎంతో ప్రయత్నం చేసింద‌ట‌.

do you know what uday kiran wife vishitha is doing right now

అయినా ఉదయ్ కిరణ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆయన మరణం తర్వాత ఆమె ఏం చేస్తుంది అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఆమె ఉదయ్ కిరణ్ మరణం సమయంలో ఫేస్ బుక్ లో జాబ్ చేస్తోంది. ప్రస్తుతం విషిత ఎక్కడ జాబ్ చేస్తుందో ఎవరికీ తెలియదు కానీ, ఆమె జీతం మాత్రం అప్ప‌ట్లోనే లక్షల్లో ఉండేది అని చెప్పవచ్చు. కానీ ఆమె ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది.

Admin

Recent Posts