వినోదం

బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో ఒక్క సీను బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?

బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరి, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా స‌మ‌ర‌సింహారెడ్డి. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది ఈ చిత్రం నుంచే. తెలుగు సినీ రికార్డులు అన్నిటిని సమరసింహారెడ్డి తిరగరాసింది. ఇక ఈ సినిమా విడుదలై జనవరి 13 కు 26 ఏళ్లు పూర్తి చేసుకుంది.

అయితే, ఈ చిత్రానికి ముందుగా సమరసింహం అనే టైటిల్ ని అనుకున్నారట. కానీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు ఈ సినిమాకు సమరసింహారెడ్డి అనే టైటిల్ ని ఎంపిక చేశారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. బాలయ్య సినిమాకు మన శర్మ మ్యూజిక్ అందించడం ఇదే మొదటిసారి.

do you know who is the actress missed to do samara simha reddy

ఇదిలా ఉంటే బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ అంటే ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ ఒక హీరోయిన్ మాత్రం ఈ సినిమాలోని ఓ సీన్ వద్దని చెప్పి సినిమా నుండే తప్పుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ రాశి. ఈ చిత్రంలో సీతాకోకచిలక సీన్ రాశి ఒప్పుకోలేదు. దాంతో ఆమె ప్లేసులో హీరోయిన్ గా సిమ్రాన్ ను తీసుకున్నారు. ఇక సంక్రాంతికి విడుదల చేసిన ఈ సినిమాకు 6 కోట్ల బడ్జెట్ అవ‌గా 16 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

Admin

Recent Posts