వినోదం

Chiranjeevi Gang Leader : గ్యాంగ్ లీడర్ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Chiranjeevi Gang Leader : స్వయం కృషితో మెగాస్టార్ ఎదిగిన చిరంజీవి ఎంతోమందిని ఆదుకుని ఆపద్బాంధవుడుగా కూడా మారాడు. త‌న న‌ట‌న‌తో ఎన్టీఆర్, కృష్ణ‌, అక్కినేని నాగేశ్వ‌ర‌రావుల త‌ర్వాత‌ నంబ‌ర్ వ‌న్ హీరోగా ఎదిగారు . చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు కాగా, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్న చిరంజీవికి 2006 లో చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు వ‌రించింది. అయితే చిరంజీవి చేసిన ఎన్నో చిత్రాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డ‌మే కాకుండా ఆయ‌న‌కు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ తెచ్చిపెట్టాయి.

మెగాస్టార్ కెరియర్లో హిట్ మూవీస్ లలో మొదటి వరుసలో వుండే సినిమా గ్యాంగ్ లీడర్. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా ముందుగా చిరంజీవితో తీయాలని అనుకోలేదట.చిరంజీవి తమ్ముడు నాగబాబు ను హీరోగా పెట్టి గ్యాంగ్ లీడర్ ని తీయాలని భావించార‌ట దర్శక నిర్మాతలు. చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే పెద్ద తమ్ముడు నాగబాబు నటుడిగా నటుడుగా పరిచయమై నిలదొక్కుకున్న స‌మ‌యంలో కొండవీటి దొంగ సినిమాలో నాగబాబు నటన చూసిన పరచూరి బ్రదర్స్ ఆయ‌న‌ హీరోగా అరె ఓ సాంబ అనే టైటిల్ తో ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట.

do you know who missed to Chiranjeevi Gang Leader

అయితే అది అనుకోని విధంగా చిరంజీవి చేతుల్లోకి రావ‌డం జ‌రిగింది. అప్పటి వరకు హీరోగా రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు నాగబాబు. అలాంటి సమయంలో ఈ గ్యాంగ్ లీడర్ కథ ఆయన కోసం సిద్ధం చేశారు. టైటిల్ కూడా అరె ఓ సాంబ అనుకున్నారు. అయితే ఈ కథ విన్న తర్వాత తన కంటే అన్నయ్య చిరంజీవికి బాగా సెట్ అవుతుందని నాగబాబు స్వయంగా చెప్పడంతో.. మళ్లీ కథలో కొన్ని మార్పులు చేసి మెగాస్టార్ తో చేశారు. ఇలా నాగబాబు చేయాల్సిన సినిమా వేరే టైటిల్ తో చిరంజీవి చేసి సూపర్ హిట్ కొట్టాడు అని చెప్పాలి.

Admin

Recent Posts