వినోదం

Super Star Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ‌ని ఆ స‌మ‌యంలో అంత దారుణంగా అవ‌మ‌నించారా.. ఎందుకు..?

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు మారుపేరు అన్న విష‌యం తెలిసిందే. సినిమానే ప్రాణంగా బ్ర‌తికిన కృష్ణ అప్పట్లో ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన హీరోల్లో నెం 1 స్థానంలో ఉన్నారు. అప్పట్లో షూటింగ్స్ లో అందరు కూడా 10 లేదా 12 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొనేవారు. కానీ కృష్ణ గారు ఒకే రోజు మూడు నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ 16 గంటలకు పైగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయ‌ట‌. టాలీవుడ్‌కు కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలను పరిచయం చేసి తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకువెళ్లి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు సూప‌ర్ స్టార్ కృష్ణ.

తెలుగు సినిమా చరిత్ర గురించి మరో వందేళ్ల తరువాత మాట్లాడినా.. కచ్చితంగా కృష్ణ పేరును గుర్తుకు చేసుకు తీరాల్సిందే. అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే.. గుర్తుచ్చే రూపం కృష్ణదే. ముందుగా ఎన్టీఆర్ ఈ పాత్రను చేయాలని అనుకున్నారు. కానీ కృష్ణ సాహసంతో అల్లూరి సీతారామరాజు సినిమాను ప్ర‌క‌టించి ఈ పాత్ర‌ను సవాల్‌గా తీసుకుని ప్రాణం పెట్టి నటించారు . 1974లో విడుదలైన ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతూ అతిపెద్ద‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగాకూడా అల్లూరి సీతారామరాజు సినిమా మిగిలిపోయింది.

do you know that krishna faced insults at that time

అయితే ఈ సినిమా విడుదలైన తరువాత కృష్ణకు వరుసగా 12 ఫ్లాపులు ఎదురయ్యాయి. అల్లూరి పాత్రలో కృష్ణను చూసిన సినీ ప్రేక్షకులు.. ఇతర పాత్రల్లో ఆయ‌న‌ను ఊహించులేకపోయారు. 1975లో కృష్ణ కెరీర్ కుదేలైంది. ఆయనతో సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్లు కూడా ఎవ‌రు ముందుకు రాలేదు. ఇక అందరూ కృష్ణ పని అయిపోయిన‌ట్టే అని అనుకున్నారు. ఆ స‌మ‌యంలో లాభం లేదనుకుని సొంత నిర్మాణం సంస్థలో పాడిపంటలు సినిమాను తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తరువాత మళ్లీ కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోలేదు. వ‌రుస ఫ్లాపులు వ‌చ్చిన స‌యంలో నీకు సినిమా అవ‌కాశాలు ఇక రావ‌ని పెద్ద ఎత్తున కృష్ణ‌ని హేళ‌న చేశార‌ట‌. చాలా అవ‌మానాలు ఎదుర్కున్న త‌రువాత ఎలాగైనా ఇండ‌స్ట్రీలో అగ్ర న‌టుడిగా కొన‌సాగాల‌ని మ‌న‌సులో నిశ్చయించుకున్నారు.

Admin

Recent Posts