వినోదం

హిట్ సినిమాలలో మంచి పాత్రలు మిస్ చేసుకున్న 10 మంది నటీమణులు వీళ్లే!

సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎంపిక చేసుకునే పాత్రల వల్ల వారికి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన పాత్ర వేరే హీరోల దగ్గరకు వెళుతూ ఉంటాయి. అలాగే ఒక హీరోయిన్ చేయవలసిన పాత్ర మరొక కథానాయిక చేయడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇక ఒకప్పటి హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వడం ఈమధ్య చూస్తూనే ఉన్నాం. వారిని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ రోల్స్ డిజైన్ చేసుకుంటున్నారు దర్శకులు. ఆ హీరోయిన్లు చేస్తేనే ఆ పాత్రలకు అందం అని భావిస్తూ ఉంటారు. కానీ కొందరు నటీమణులు ఒక్కోసారి ఆయా పాత్రలను మిస్ చేసుకున్న పాత్రలు వేరే వాళ్లకు మంచి సక్సెస్ ని అందించిన సందర్భాలు కోకోల్లలు. ఇలా కొంతమంది పాపులర్ హీరోయిన్లు హిట్ సినిమాలలో మంచి పాత్రలను మిస్ చేసుకున్నారు. ఇలా మిస్ చేసుకున్న సినిమాలు ఏంటో చూద్దాం..

రాజా ది గ్రేట్ సినిమాలో తల్లి పాత్రకు విజయశాంతిని సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పడంతో రాధికని తీసుకున్నారు. నిజం సినిమాలో మహేష్ తల్లి పాత్రకు శ్రీదేవిని సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పడంతో ఆ పాత్రను సీతామాలక్ష్మి ఫెమ్ తాళ్లూరి రామేశ్వరి పోషించారు. ఆ తర్వాత బాహుబలి లో శివగామి పాత్రకు కూడా మొదట శ్రీదేవిని సంప్రదించారు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ పాత్రలో రమ్యకృష్ణ నటించారు. నిజం సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు జ‌య‌సుధ‌ను కూడా అడిగారట. అయితే జయసుధ ఓకే చెప్పినప్పటికీ కాల్ షీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకున్నారు.

do you know who missed to do these characters in some movies

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రకి సీనియర్ స్టార్ హీరోయిన్ రాశిని అడిగారు. కానీ ఆమె నో చెప్పడంతో అనసూయతో ఆ పాత్రను చేయించారు. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ కి తల్లి పాత్రలో ల‌య‌ను అడిగారు. కానీ ఆ పాత్ర ఆమెకు నచ్చకపోవడంతో నో చెప్పింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు మొదట మీనా ని అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆ పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మహర్షి సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకి జయప్రదని మొదట సంప్రదించారు. కానీ ఫైనల్ గా ఆ పాత్రలో జయసుధ నటించారు.

నిజం సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు రేఖని కూడా సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పడంతో ఆ పాత్రలో తాళ్లూరి రామేశ్వరి నటించారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రకు విద్యాబాల‌న్‌ను సంప్రదించారు. కానీ ఈమె నో చెప్పడంతో ఈ పాత్రలో అంజలి నటించారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు సంతోషం సినిమా హీరోయిన్ గ్రేసి సింగ్ ను సంప్రదించారు. కానీ ఈమె నో చెప్పడంతో సుకన్యని తీసుకున్నారు. ఇలా పలువురు మిస్ చేసుకున్న పాత్ర‌ల్లో వేరే న‌టీమ‌ణులు యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Admin

Recent Posts