వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ పరిశ్రమలో కళాకారులు ఎప్పటికప్పుడు తమని తాము నిరూపించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది&period; ఇక హీరోలు కథ&comma; కథనాలకు అనుగుణంగా ద్విపాత్రాభినయం చేసి అలరించడం అనేది కామన్&period; వెండితెరపై తమ అభిమాన హీరోలు ఒక పాత్రలో కనిపిస్తేనే అభిమానులు ఉత్సాహంతో ఈలలు&comma; కేకలు వేస్తారు&period; అలాంటిది వారి అభిమాన హీరోలు ద్విపాత్రాభినయం&comma; లేదా త్రిపాత్రాభినయం చేస్తే&period;&period; ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు&period; తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి ప్రయోగాలకు తొలి తరం నటులే శ్రీకారం చుట్టారు&period; అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ వరకు ట్రిపుల్ రోల్ చేసిన ఆ కథానాయకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు త్రిపాత్రాభినయానికి పర్యాయపదం&period; టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి ట్రిపుల్ రోల్ చేసిన ఏకైక కథానాయకుడు కూడా ఎన్టీఆరే&period; కులగౌరవం&comma; శ్రీకృష్ణసత్య&comma; శ్రీమద్విరాట పర్వం&comma; దానవీరశూరకర్ణ&comma; శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర&comma; వంటి చిత్రాలలో మూడు&comma; అంతకంటే ఎక్కువ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు&period; తెలుగు సినిమా హిస్టరీ లోనే ఎక్కువసార్లు ట్రిపుల్ రోల్ చేసి సరికొత్త రికార్డును సృష్టించారు నటశేఖర&comma; సూపర్ స్టార్ కృష్ణ&period; కుమార రాజా&comma; పగబట్టిన సింహం&comma; రక్తసంబంధం&comma; బంగారు కాపురం&comma; బొబ్బిలి దొర&comma; డాక్టర్ సినీ యాక్టర్&comma; సిరిపురం మొనగాడు వంటి ఏడు చిత్రాలలో మూడు పాత్రలు పోషించారు&period; నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు టి రామారావు దర్శకత్వం వహించిన నవరాత్రి అనే సినిమాలో ఏకంగా తొమ్మిది క్యారెక్టర్లు చేయడం విశేషం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91559 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;actors-1&period;jpg" alt&equals;"these actors done triple roles in movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలనాటి అందాల హీరో శోభన్ బాబు కూడా 1983లో ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రంలో మొట్టమొదటిసారిగా ట్రిపుల్ రోల్ లో నటించారు&period; ముగ్గురు మొనగాళ్లు&comma; లారీ డ్రైవర్&comma; పోలీస్ ఆఫీసర్&comma; క్లాసికల్ డాన్సర్ ఇలా ముచ్చటగా మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసి మెప్పించారు&period; నటసింహా నందమూరి బాలకృష్ణ అధినాయకుడు చిత్రంలో మొదటిసారి ట్రిపుల్ లో నటించారు&period; జై లవకుశ చిత్రంలో వైవిధ్యభరితమైన మూడు పాత్రలలో నటించి తన నటనతో పాత్రలకు ప్రాణం పోశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్&period; అమిగోస్ మూవీ లో మూడు సరికొత్త గెటప్స్&comma; డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించి కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలు పోషించాడు&period; కొబ్బరి మట్ట చిత్రంలో మూడు పాత్రలలో నటించిన సంపూర్ణేష్ బాబు ఈ జనరేషన్ లో ఎన్టీఆర్ తర్వాత త్రిపాత్రాభినయం చేసిన హీరోగా రికార్డులకెక్కాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts