వినోదం

ఈగ సినిమాలో ఇది గ‌మ‌నించారా..? చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జ‌క్క‌న్నా అంటూ నెట్టింట ట్రోల్స్..!

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా విడుదలై 13 సంవత్సరాలు అయింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించింది. కథ, కథనం అద్భుతంగా ఉంటే స్టార్ హీరోలు నటించకపోయిన సక్సెస్ సాధించవచ్చని రాజమౌళి ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి ఈగ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు.

బలవంతుడైన విలన్ ను ఈగ ముప్పతిప్పలు పెట్టే కథతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు. మర్యాద రామన్న మూవీ తర్వాత ప్రభాస్ తో మూవీ తెరకెక్కించడానికి ఐదు నెలల సమయం ఉండటంతో ఈగ మూవీని జక్కన్న తెరకెక్కించాలని అనుకున్నారు. 3 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి కొన్ని థియేటర్లలోనే సినిమాలు రిలీజ్ చేయాలని రాజమౌళి భావించారు. ఈగ అనేది చిన్న పురుగు కావడంతో పాటు చేతితో సులువుగా వదిలించుకోగలుగుతాం. అలాంటి పురుగు మనిషి పై పగబడితే ఆసక్తికరంగా ఉంటుందని భావించి రాజమౌళి ఈగతో సినిమా తీశారు. అయితే, ఈ సినిమాలో ఓ బిగ్‌ మిస్టేక్‌ చేశారు రాజమౌళి.

have you observed this small mistake in eega movie

దీంతో ఈ మిస్టేక్‌ ను గమనించిన నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో కొంచెం కొంచెం సాంగ్‌ అనేది ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. అయితే, ఈ సాంగ్‌ కంటే ముందు సమంత ఆఫీస్‌ నుంచి బయటకు రాగా, బైక్‌ లో పెట్రోల్‌ అయిపోతుంది. దీంతో బైక్‌ అక్కడే పార్క్‌ చేసి, సమంత.. నానితో కలిసి ఇంటికి వెళుతుంది. రాత్రి పెట్రోల్‌ లేకపోవడంతో సమంత నడుచుకుంటూ వెళుతుంది. కానీ తర్వాతి రోజు ఉదయం సమంత బైక్‌ ఫుల్‌ ట్యాంక్‌ చూపిస్తుంది. ఆ బైక్‌ వేసుకుని, సమంత ఆఫీసుకు వెళుతుంది. దీంతో, అసలు బైక్‌ ఎలా వచ్చింది జక్కన్నా అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Admin

Recent Posts