వినోదం

చైతు విషయంలో నాగార్జున తప్పిదం వల్ల.. ఆ సూపర్ హిట్ సినిమా మిస్సయిందా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం ఊహించడం కష్టం. ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం కామన్. అయితే మూవీ హిట్ అయితే మాత్రం హీరో దురదృష్టమని అంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే ఆ హీరోలకు లక్కు లేదు అని భావిస్తారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే అక్కినేని నాగార్జున ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ సమయంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన జోష్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ వాసు శర్మ. ఈమూవీ కాలేజ్ నేపథ్యం గొడవలతో తెరకెక్కింది.

అయితే ఈ సినిమా కథ విన్న వెంటనే దిల్ రాజుకు శివ సినిమా గుర్తుకు వచ్చిందట. ఆ టైపులో సినిమా వచ్చి చాలా రోజులైంది కదా..? కథ నచ్చడంతో రామ్ చరణ్ కు కథ ముందుగా చెప్పారట. ఆ సమయంలో రామ్ చరణ్ మగధీర సినిమా ప్రాసెస్ లో ఉంది. ఈ కథ రామ్ చరణ్ కు బాగా నచ్చింది. చిరంజీవి కూడా కథ నచ్చిన కానీ ఆ సమయంలో మగధీర సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే చిరంజీవి కథ విని ఒక రోజు తర్వాత విషయం చెబుతాను అని అన్నారట. మరుసటి రోజు దిల్ రాజుకు కాల్ చేసి ఈ కథను నాగబాబుకు చెప్పమని అన్నారట. ఈ కథను విన్న నాగబాబు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారట. చివరకు తిరిగి తిరిగి కథ నాగార్జున కాంపౌండ్ చేరగా దీన్ని నాగార్జున ఓకే చెప్పి చైతన్యతో సినిమా చేయడానికి ఫైనల్ అయింది. ఈ సినిమాతో నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు.

nagarjuna made mistake in naga chaitanya movie

ఈ సమయంలోనే చైతన్యను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు కొత్త బంగారు లోకం కథతో దిల్ రాజ్ నాగార్జునకు చెప్పారట. కానీ ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో గా వస్తున్న నాగ చైతన్య కు సాఫ్ట్ కథకన్నా కాస్త యూత్ ను కనెక్టు అవ్వాలంటే యాక్షన్ కథ ఉంటే బాగుంటుందని నాగ్ అన్నారట. మెగా కాంపౌండ్ రిజెక్ట్ చేసిన కథను నాగార్జున ఓకే చెప్పడంతో నాగచైతన్య ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్న అంచనాలను దాట లేకపోయింది. సినిమా ప్లాప్ అయింది. కానీ కొత్త బంగారులోకం సినిమా మాత్రం యూత్ కు కనెక్ట్ అయిపోయి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ అనేక సినిమా ఆఫర్లతో దూసుకుపోయారు. ఒకవేళ చైతన్య ఈ సినిమాను చేసి ఉంటే ఆయన ఎంట్రీ మాత్రం చాలా బాగా ఉండేదని దిల్ రాజు అన్నారట.

Admin

Recent Posts