వినోదం

Pawan Kalyan Favorite Food : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఇష్ట‌మైన ఫుడ్ ఏమిటో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Pawan Kalyan Favorite Food : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఫుల్ బిజీగా మారారు. ఆయ‌న న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కొన్ని నెల‌ల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఓ వైపు ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే.. మ‌రోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీలో న‌టిస్తున్నారు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్ప‌ట్లో త్రివిక్ర‌మ్‌తో చేసిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. ఈ క్ర‌మంలోనే సినిమాల‌కు బ్రేక్ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో పాల్గొన్నారు. ఆ త‌రువాత మ‌ళ్లీ సినిమాల బాట ప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వ‌కీల్ సాబ్ చేశారు. ఈ మూవీ కూడా ఆక‌ట్టుకుంది. అయితే త‌న కుటుంబం క‌న్నా ప్ర‌జ‌లకే ఎక్కువ ద‌గ్గ‌ర‌గా ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు అప్పుడ‌ప్పుడు వైర‌ల్ అవుతుంటాయి. ఇక ప‌వ‌న్‌కు ఇష్ట‌మైన ఫుడ్ ఏమిట‌ని చెప్పి ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇష్ట‌మైన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Pawan Kalyan Favorite Food do you know what it is

పవన్ కళ్యాణ్ కు ఒక వంటకం అంటే చాలా ఇష్టమని టాక్. పవన్ కు ఇష్టమైన వంటకాల్లో అరటికాయ వేపుడుదే తొలి స్థానం. సన్నగా, నిలువుగా కోసిన అరటికాయ ముక్కలలో ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించి చేసిన అరటికాయ వేపుడు అంటే పవన్ కి మక్కువట. నిజానికి చాలామంది స్టార్ లు చికెన్ బిర్యానీ అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పడం వింటుంటాం. అయితే అందుకు భిన్నంగా పవన్ అరటికాయ వేపుడును ఇష్టపడ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇక అరటికాయ వేపుడు ఉంటే మరే వంటకం ఉన్నా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఆ వంటకాన్ని ఇష్టంగా తినేస్తారట‌. ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతోపాటు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, ఓజీ అనే చిత్రాల్లోనూ న‌టిస్తున్నారు.

Admin

Recent Posts