వినోదం

ఈ ఫొటోలో చిన్నారి క‌న్నుగీటుతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి అమాయ‌క‌పు చూపులు చూస్తూ కుర్రాళ్ల గుండెల్లో ప్రకంప‌నలు పుట్టించింది. అంతేకాదు క‌న్నుగీటుతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. కన్ను గీటుతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సాధించుకుని యంగ్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేరీర్ ప్రారంభంలోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మరింతగా అభిమానులను సంపాదించుకునేందుకు ఇంటర్నెట్ లోనూ రచ్చ చేస్తోందీ బ్యూటీ. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అభిమానులు, నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మ‌రి ఎవ‌రు అనే క‌దా మీ డౌట్. మ‌రెవ‌రో కాదు ప్రియ ప్ర‌కాశ్ వారియ‌ర్.

మ‌ల‌యాళ భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ఒరు ఆదార్ ల‌వ్ అనే సినిమాలో ఒకే ఒక్క సీన్తో ఫుల్ పాపులారిటీ అంది పుచ్చుకుంది. నెట్టింట చురుకుగా ఉండే ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌ను షేర్ చేస్తూ అంద‌రినీ ప‌లుక‌రిస్తుంటుంది. నితిన్‌తో క‌లిసి చెక్ సినిమాలో మెరిసింది ప్రియా వారియ‌ర్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉంది. చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీ షెడ్యూల్ పెట్టుకుంది ప్రియా వారియ‌ర్.

priya prakash varrier childhood photo viral

ప్రియావారియ‌ర్ స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. హాట్ నెస్ తో కుర్రాళ్ల మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది. విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లు, హోటల్లో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులిస్తోంది.ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ పిచ్చెక్కిస్తోంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్ లోనూ గట్టిగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. క్రేజీ ఫొటోషూట్లతో మరింతగా పాపులారిటీని పెంచుకుంటోంది.

Admin

Recent Posts