వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారు. నిర్మించడమే కాదు ఈ గ్రామానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సినీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తెలియని ఎవరు ఉండరు. అలాంటిది నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండల పరిధిలోని ఈదులూరు గ్రామ శివారులో కొన్ని ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారు. నిర్మించడమే కాదు ఈ ఈదులూరు గ్రామానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాపు ఈ గ్రామానికి వచ్చి 15 సంవత్సరాలు కావచ్చు. ఈదులూరు గ్రామమే నా గ్రామం అనుకుంటున్నానని అన్నారు. అదే విధంగా ప్రజలకు ఏదైనా చేయాలని గ్రామస్తులు ఏది అడిగినా కాదనకుండా తోచినంత ఉన్నదంతా చేస్తా అని తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్, తరగతి గదులు లేవంటే నిర్మించాను. నిరుద్యోగులకు చదువుకోవడానికి గ్రంథాలయం ఏర్పాటు చేశాను. అదేవిధంగా కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో సౌజన్యంతో హెల్త్ క్యాంప్ ప్రతి నెలా నిర్వహించి మందులు కూడా ఉచిత పంపిణీ చేస్తున్నాము. ఏదైనా పిల్లలకు ఫీజు విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నా వంతు కూడా సహాయం చేస్తున్నాను అని అన్నారు. ఈదులూరు గ్రామానికి చెందిన పున్న రమేష్ దర్శకుడు రాజమౌళి గ్రామానికి చేసిన సేవలు మరువలేనివి. 10 సంవత్సరాల క్రితం 100 ఎకరాల్లో రాజమౌళి ఫామ్ హౌస్ నిర్మించారు. ఆ ఫామ్ హౌస్ లో రాజమౌళి అత్త రాధమ్మ ఉంటున్నారు. వారి సేవలు ఎల్లవేళలా మా గ్రామానికి ఉంటున్నాయి అని తెలియజేశారు.
గ్రామంలో ఎటువంటి పండగ జరిగినా వారి వంతు సహకారం ఉంటుంది. స్కూల్లో సైన్స్ ల్యాబ్, అమరవీరులకు జ్ఞాపకార్థంగా గ్రంథాలయాలు, అదేవిధంగా కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి నెలా హెల్త్ క్యాంప్, ఉచిత మందులు ఇస్తున్నారు అని అన్నారు. గ్రామంలో యువత ఎటువంటి కార్యక్రమం చేపట్టినా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. ఇలాగే వారి సేవలు మా గ్రామానికి ఉండాలని, అలాగే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని తెలియజేశారు.