వినోదం

తమ్ముడు సినిమాలో లవ్ లీ గా నటించిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

సినిమా అనేది ఓ పెద్ద మాయ ప్రపంచం. తెర వెనుక చెమటోడ్చేవాళ్లు మనకు ఎప్పటికీ కనిపించరు. తెర పైన నటించే వాళ్లనే మనం గుర్తుపెట్టుకుంటాం. అలా వాళ్లలో కొందరు ఓవర్ నైట్ స్టార్లు అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోయిన్లు చాలామంది ఇప్పుడు కనుమరుగైపోయారు. అలా 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో డెబ్యూ చేసిన ఓ హీరోయిన్.. ఆ ఒక్క సినిమా తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అదితి గోవత్రికర్.

ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమే కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన తమ్ముడు మూవీలో లవ్ లీ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ప్రీతి జింగానియా జంటగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో 1999లో విడుదలైన మూవీ తమ్ముడు. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో లవ్లీ గా అందరినీ ఆకట్టుకుంది అదితి. మహారాష్ట్రలోని పన్వేల్ ఏరియాలో జన్మించిన అదితి చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత టెలివిజన్ నటిగా, హోస్ట్ గా కూడా ఆకట్టుకుంది.

see aditi govatrikar how she is changed now

ఇక పవర్ స్టార్ సరసన తమ్ముడు సినిమా తర్వాత హిందీ చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలలోకి రాకముందే కాలేజీ రోజుల్లో ఆమె ప్రేమించిన ముఫజల్ లక్డావాలతో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి.. 1998లో అతడిని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక ఈమధ్య పలు టీవీ షోలలో, వెబ్ సిరీస్ లలో కూడా మెరుస్తోంది. తాజాగా అదితి టాపిక్ వెలుగులోకి రాగా.. అదితి ఇంతలా మారిపోయిందా? అని సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి.

Admin

Recent Posts